ఈ నెలలోనే కొత్త ఆల్టో రిలీజ్ చేసేందుకు మారుతీ సుజుకీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్ ఫోటో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఆల్టో లేటెస్ట్ మోడల్ రోడ్లపై టెస్ట్ రన్ నిర్వహిస్తున్నప్పుడు కొందరు రహస్యంగా ఫోటోలు క్లిక్ చేశారు.
మారుతీ సుజుకీ తొలి ఆల్టో కార్‌ను 2000 సంవత్సరంలో రిలీజ్ చేసింది. రెండో తరం ఆల్టో కార్ 2012 లో రిలీజైంది. అంటే దశాబ్దం తర్వాత మూడో తరం ఆల్టో కార్ రాబోతోంది. కొత్త ఆల్టో కార్లో ఆర్కిటెక్చర్‌తో పాటు ఇంజిన్‌లో మెరుగుదల చూడొచ్చు.
మారుతీ సుజుకీ ఆల్టో కార్ హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే మారుతీ సుజుకీ నుంచి ఎస్-ప్రెస్సో, సెలెరియో, బ్యాలెనో, ఎర్టిగా లాంటి కార్లు హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చాయి.
ఇంజిన్ విషయంలో అతిపెద్ద అప్డేట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మారుతీ సుజుకీ 2022 ఆల్టో కారులో 796cc మోటార్, 1.0 లీటర్ K10C Dual-Jet ఉంటాయని భావిస్తున్నారు. 48 bhp పవర్ ఔట్పుట్, 69Nm టార్క్ పవర్ ఔట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది.
మరో గుడ్ న్యూస్ ఏంటంటే మారుతీ సుజుకీ థర్డ్ జెన్ ఆల్టో సీఎన్జీ వర్షన్ కూడా తీసుకురాబోతోంది. ఇప్పుడే కాకుండా త్వరలో ఆల్టో సీఎన్జీ కూడా రానుంది. డిజైన్ అప్డేట్లలో ప్రధానంగా హ్యాచ్‌బ్యాక్ మునుపటి కంటే మరింత గుండ్రంగా ఉంటుంది.
ప్రస్తుత సెలెరియో లాగానే హ్యాచ్‌బ్యాక్ ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌ను పూర్తిగా పునరుద్ధరించవచ్చు. డాష్‌బోర్డ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సీట్లు కూడా కనిపించబోతున్నాయి.
ఇప్పటికే ఉన్న ఆల్టో కారుతో పోలిస్తే 2022 మారుతీ సుజుకీ ఆల్టో ఫీచర్లు అధునాతనమైనవిగా, ఉన్నతమైనవిగా ఉండబోతున్నాయి.
ఇందులో 7.0-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల ORVMలు ఉంటాయి.
ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ధర రూ.4.10 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
0 Comments:
Post a Comment