రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఆగస్ట్ 5న సమావేశం కానుంది.
ఈ సందర్భంగా రెపో రేటును ఆర్బీఐ మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో హోమ్ లోన్లు తీసుకున్న వారి నెలవారీ వాయిదాల(EMI)పై ప్రభావం పడనుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకున్న మొత్తానికి చెల్లించే వడ్డీని రెపో రేటు అంటారు.
ఈ కీలక రేటును ఆగస్టు పాలసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఆర్బీఐ ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి రెండుసార్లు రెపో రేట్లను 90 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) పెంచింది.
బ్యాంకులు కస్టమర్లకు అందించే లోన్ రేట్లు కూడా ఈ రెపో రేటుపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల వరుసగా పెరిగిన రెపోరేట్లతో ఆయా బ్యాంకులు హోమ్ లోన్ల వడ్డీ రేట్లను పెంచాయి.
హోమ్ లోన్లపై బ్యాంకులు అమలు చేస్తున్న తాజా వడ్డీ రేట్లు ఇవే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.55 శాతం
సిటీ బ్యాంక్ 6.65 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా 7.45 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.90 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.50 శాతం
యాక్సిస్ బ్యాంక్ 7.60 శాతం
కెనరా బ్యాంక్ 7.05 శాతం
వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో వినియోగదారులు హోమ్ లోన్లను ముందస్తుగా చెల్లించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది వీలైనంత త్వరగా లోన్లను పూర్తి చేయడానికి, వడ్డీపై డబ్బును ఆదా చేయడానికి, EMIలను తగ్గించడానికి ఉత్తమ మార్గంగా విశ్లేషిస్తున్నారు.
మార్కెట్లు పడిపోతున్నా లేదా పెరుగుతున్నాయా అనే దానితో సంబంధం లేకుండా హౌసింగ్ లోన్ ముందస్తు చెల్లింపు ఎల్లప్పుడూ మంచిదని బ్యాంక్‌బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి చెప్పారు. ఆయన CNBC-TV18.comతో మాట్లాడుతూ.. 'ముందస్తు చెల్లింపు రుణగ్రహీతలు రుణాన్ని చాలా ముందుగానే పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.
అదనపు వడ్డీని ఆదా చేయడానికి వీలుంటుంది. అయితే, హోమ్ లోన్ ముందస్తుగా చెల్లించాలనే నిర్ణయం ఖర్చు, ప్రయోజన విశ్లేషణపై ఆధారపడి ఉండాలి. ముందస్తు చెల్లింపు అనేది వడ్డీని ఎక్కువగా ఆదా చేయకపోతే ఫలితం ఉండదు.
ఈ ఈఎంఐ మొత్తాన్ని ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టి అధిక రాబడిని అందుకోవచ్చు. ఆ ఆదాయంతో సులువుగా ఈఎంఐలను చెల్లించవచ్చు. ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందవచ్చు.' అని చెప్పారు.
ఇతర బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
ప్రస్తుతం హోమ్ లోన్లు తీసుకున్న వారు సీజబుల్ రెసిడ్యువల్ టెన్యూర్ ఉండటంతో.. తమ ప్రస్తుత హోమ్ లోన్‌ను తక్కువ వడ్డీకే అందించే మరో రుణదాతకు బదిలీ చేయవచ్చు. ఎస్బీఐ మాక్స్‌గెయిన్, ఇతర హోమ్ లోన్ సేవర్/ఓవర్‌డ్రాఫ్ట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
ఓవర్‌డ్రాఫ్ట్ ఎంపిక కింద, హోమ్ లోన్ తీసుకున్న వారి సేవింగ్స్‌ను డిపాజిట్ చేయడానికి సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. హోమ్ లోన్ అకౌంట్‌కు అది లింక్ అఅవుతుంది. పొదుపు/కరెంట్ ఖాతాలో బ్యాలెన్స్‌ను బకాయి ఉన్న లోన్ మొత్తం నుంచి డిడక్ట్ చేసిన తర్వాత హోమ్ లోన్ వడ్డీ వ్యయం లెక్కిస్తారు.
ఇది రుణగ్రహీతకు వడ్డీ ధరను తగ్గించవచ్చు. ఏదైనా ఫండ్ అవసరం వచ్చినప్పుడు సేవింగ్స్/కరెంట్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్స్ ఇవే">
అందువల్ల ఓవర్‌డ్రాఫ్ట్ ఆప్షన్ గృహ రుణగ్రహీత లిక్విడిటీని కొనసాగిస్తూ ముందస్తు చెల్లింపులు చేయడం ద్వారా ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది. కేవలం ప్రీపేమెంట్ కోసం వెళ్లే వారు గృహ రుణం ద్వారా పొందే పన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రీపేమెంట్ నిబంధనలు, షరతులను తనిఖీ చేయాలి.
0 Comments:
Post a Comment