విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన వీరభద్రుడికి జైలుశిక్ష, జరిమానా
ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు జీత భత్యాలు పొందుతూ, పదోన్నతికి అవసరమైన డిగ్రీ/ ఉన్నత విద్య చదివేందుకు అడ్డం పడేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్/డైరెక్టర్ 2021 జనవరిలో ఇచ్చిన మెమోను ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 1977లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి విరుద్ధంగా ఆ మెమో ఉందంటూ.. దాన్ని రద్దు చేసింది. వారి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమంటూ మండిపడింది. న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగు ణంగా సకాలంలో పిటిషనర్లను బీపీఈడీ కోర్సుకు పంప డంలో విఫలమైనందుకు పాఠశాల విద్యాశాఖ పూర్వ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ వాడ్రేవు చినవీరభద్రుడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయనకు నాలుగు వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తూ జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు ఇచ్చారు. న్యాయ వాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును రెండు వారాలు చేశారు. సాంఘిక సంక్షే మశాఖ 1977 ఆగస్టు 30 జారీచేసిన జీవో 342కి అనుగుణంగా పిటిషనర్లు ప్రయోజనాలు పొందేందుకు అర్హులని స్పష్టంచేశారు. పిటిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తూ.. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్). పోస్టులకు అవసరమైన బీపీఈడీ అర్హత / శిక్షణ పొందేం దుకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు.
0 Comments:
Post a Comment