Chanakya Niti Money Making Tips: ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అన్నింటికి ధనమే మూలం అని దీనర్థం. ప్రపంచంలో డబ్బుకు లొంగని వారు ఉండరని తెలిసిందే.
డబ్బు మీద వ్యామోహంతో ఎంతో మంది ఎన్నో వ్యవయప్రయాసలు పడినా వారికి దక్కేది మాత్రమే దక్కుతుంది. అత్యాశ పడినంత మాత్రాన ధనం సొంతం కాదు. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఖర్చు పెట్టాలంటే సునాయాసంగా పెట్టొచ్చు.
డబ్బు సంపాదనకు ఎంత కష్టపడతామో ఖర్చు పెట్టేందుకు అంతగా ఆలోచిస్తాం. అప్పనంగా వచ్చిన సంపాదన మాత్రం విచ్చలవిడిగా ఖర్చయిపోతుంది. ఆగాన వచ్చింది భోగాన పోతుందని సామెత.
డబ్బు సంపాదన అంటే అంతు సులువైన పని కాదు. దానికి ఎంతో శ్రమ కావాలి. కష్టపడితేనే డబ్బు మన చేతికి వస్తుంది.
సంపాదించిన డబ్బు చిటెకెలో ఖర్చవుతుంది. కానీ ఖర్చు పెట్టేముందు బాగా ఆలోచించాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. జీవితంలో డబ్బు విషయంలో పొదుపు పాటించాలని సూచించాడు. లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయని తెలుస్తోంది.
డబ్బు ఖర్చు పెట్టే ముందు కాస్త ఆలోచించాలి. ఏది అత్యవసరమో దాన్ని తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చి దాన్ని తీర్చుకునేందుకు మొదట ప్రాధాన్యం ఇచ్చి తరువాత క్రమంలో మిగతా ఖర్చులు ఎంచుకోవాలి. అంతేకాని ప్రాధాన్యం లేనివి కొనుక్కుని అవసరమైన వాటిని వాయిదా వేస్తే చిక్కులు తప్పవు.
జీవితంలో పొదుపు లేకపోతే కష్టాలు పడాల్సి వస్తోంది. అందుకే సంపాదించిన మొత్తాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొంత పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలకు పనికొస్తుంది. దీంతో సంపాదించిన డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే.
సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు చేయడంలో అంతే ఆలోచన చేసి డబ్బును పొదుపు చేయడం ఉత్తమం. డబ్బు విషయంలో అందరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. అందు కోసం నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంటుందని తెలుసుకోవాలి.
ఆపద కాలంలో డబ్బు సాయం చేస్తుంది. ఏ రోగం వచ్చినా ఆదుకునేది డబ్బే అని గ్రహించుకోవాలి. డబ్బు పొదుపు చేస్తేనే త్వరగా ధనవంతులు అవుతారని చాణక్యుడు వివరించాడు. డబ్బు స్నేహితుడిలా ఆదుకుంటుంది. రక్షణగా ఉంటుంది.
అందుకే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తదనంతరం తీవ్ర పరిణామాలు వస్తాయి. ముందస్తుగా అప్రమత్తంగా వ్యవహరించి దాచుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. త్వరలో ధనవంతులు కావాలంటే పొదుపు ఒక్కటే సరైన మార్గమని ఆచార్య చాణక్యుడు ఆనాడే చెప్పడం గమనార్హం.
0 Comments:
Post a Comment