Search This Blog

Tuesday, 23 August 2022

బరువు తగ్గించడానికి అవిసె గింజలు ఎలా తీసుకోవాలి?



అవిసె గింజ జీవక్రియ రేటును పెంచి,. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీనివలన శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గును నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది.

అవిసె గింజలలో పీచు, ఖనిజాలు, విటమిన్లతో పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యవంతంగా పెరగడానికి మాంసకృత్తులు దోహదం చేస్తాయి పీచుపదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. 

బరువు అధిక తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి వీటిలో పీచు మరియు ఒమేగా 3ఫ్యాటీ సమృద్ధిగా లభిస్తాయి ఇవి మన శరీరంలో ఉండే కొవ్వును త్వరగా కరిగించివేస్తాయి అలాగే అవిసె గింజల్లో ఉండే మ్యుసిలెజ్ అనే పీచు పదార్థం త్వరగా నీటిలో కలిసి మన కడుపులో ఉండే వేగులకు అద్భుతంగా సహాయపడుతుంది అలాగే ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసి ఆకలి మరియు ఆహారాన్ని తినాలనే కోరికను తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది మనం రోజు తిని ఓట్స్‌ను ఉడికించి తర్వాత అంటే పైన ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను చల్లుకుని తింటే మంచిది. బరువు తగ్గుతారు.

అవిసె ఆకులు తీసుకుని వాటితో కూర చేసుకుంటే సుఖ విరోచనం, పొట్ట, నోడుము చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది నడుము సన్నగా తయారు అవుతుంది మనం త్రాగే పండ్ల రసంలో ఒక్క స్పూన్ అవిసె గింజల పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు. 

ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్‌పై అవిసె గింజల నూనె చల్లుకుని తింటే బరువు తగ్గవచ్చు. మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లోనూ అవిసె గింజల పొడిని కలుపుకుని తీసుకోవచ్చు. దీని వల్ల కూడా బరువు తగ్గుతారు అవిసె గింజలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఇవి ఇన్ ఫ్లమేషన్ ను నివారించడం ద్వారా హృద్రోగాలు, కీళ్ళవాతం, ఉబ్బసం, మధుమేహం ఇంకా కొన్ని క్యాన్సర్ల (ప్రత్యేకించి పొరుషగ్రంధి క్యాన్సర్) నుంచి శరీరాన్ని కాపాడతాయి. 

గొప్ప ఉపశమనం లైంగిక దుర్బలంతో బాధపడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వలన మేలు చేకూరుతుంది. అవిసె గింజలలో బలమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి శరీరాన్ని క్షాళన చేస్తాయి.

రక్తాన్ని శుద్ధి గావిస్తాయి. చర్మం, శిరోజాల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఈ యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగ నిరోధకశక్తిని పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజలలోని ఫోలిక్ ఏసిడ్ వ్యంధ్వ మహిళలకు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

మహిళలలో ఋతు క్రమానికి ముందు తలెత్తే(పిలిమిలిన్) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. మహిళలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల కారణంగా తలెత్తే హానికారక ప్రభావాలను అరిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. 

శరీరంలోని కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో సాయం చేస్తాయి. 

రక్తపోటు మరియు బిపిని తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే 50 గ్రాములు హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల 20 శాతం రక్తపోటు తగ్గుతుందని తాజా పరిశోధనలో లో తేలింది కాబట్టి రక్తపోటు మరియు బిపితో బాధపడుతున్న వాళ్లు అవిసె గింజలు తీసుకోవడం చాలా మంచిది అవిసె గింజలలో ఉండే ముసిలేజ్ అనే పదార్థం జీవక్రియను నెమ్మది చేసి రక్తంలో గ్లూకోస్ కలవడాన్ని తగ్గిస్తుంది రోజు ఉదయాన్నే అవిసె గింజలు తీసుకునేవారిలో టైప్1 మరియు టైప్ టైప్2 మధుమేహాన్ని తగ్గిస్తుంది ది అని అధ్యయనంలో తేలింది కాబట్టి టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఒక గ్లాసు మంచి నీటిలో లో 30 గ్రాముల అవిసె గింజలను వేసి పది నిమిషాలు నానబెట్టి తర్వాత తింటే మంచి ఫలితం ఉంటుంది అవిసె గింజలు జలుబు, దగ్గును తగ్గిస్తుంది ఒక కప్పు నీటిలో 2-3 చెంచాల అవిసె గింజలను బాగా ఉడికించి వడకట్టిన 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకుంటే దగ్గు మరియు జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 

ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతూ ఉంటారు దీనికి చక్కటి పరిష్కారం అవిసె గింజలుతో మనకు లభిస్తుంది అవిసె గింజలు 5 గ్రాములు మరియు ఆవాలు 5గ్రాములు తీసుకుని రెండింటిని కలిపి మంచి నీటితో మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తల నొప్పి ఉన్నచోట రాసుకోవాలి పైన పేపర్ ని అతికించి వేడి నీటి తో మర్దనా చేసుకోండి వెంటనే తన నొప్పి అప్పటికి అప్పుడు తగ్గిపోతుంది

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top