✍️ప్రాథమిక విద్యాబోధనలో మాతృభాషకే ప్రాధాన్యం ఇవ్వాలి
*🌻ఈనాడు, దిల్లీ*: ప్రాథమిక విద్యాబోధనలో సాధ్యమైనంతమేరకు మాతృభాషకే ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 29(ఎఫ్) చెబుతోందని కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పేర్కొ న్నారు. ఆమె సోమవారం లోక్సభలో వివిధ రాష్ట్రాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులి చ్చారు. "విద్య జాబితాలోని అంశం. అత్యధిక పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధి లోనే ఉన్నాయి. జాతీయ విద్యావిధానంలోని పేరా 4.11 ప్రకారం ఎక్కడ వీలైతే అక్కడ కనీసం అయిదో తరగతి వరకైనా విద్యాబో ధన మాతృభాషలోనే ఉండాలి. అయితే ఇది 8. ఆ పై తరగతులవరకూ ఉంటే మంచిది. ఆ తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ స్థానిక భాషల్లో బోధనను కొనసాగించాలి. నిపుణ్ భారత్ మిషన్ ప్రకారం బోధన, అభ్యాస ప్రక్రియ, అందుకు సంబంధించిన మెటీరియ ల్ను మాతృభాషల్లోనే అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ - 2020-21 ప్రకారం దేశంలో 1 నుంచి 5వ తరగతి వరకు 28 భారతీయ భాషల్లో బోధన జరుగుతోంది” అని కేంద్రమంత్రి వెల్లడించారు.
0 Comments:
Post a Comment