🔳రేపు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల (జులై-2022) ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెటర్మెంటు ఫలితాలు కూడా విడుదల కానున్నాయని దేవానందరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వారి ఫలితాలను తెలుసుకోవచ్చునని వెల్లడించారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,07,160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బెటర్మెంటు పరీక్షలు 8,609 మంది రాశారు. మొత్తం 986 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
0 Comments:
Post a Comment