Search This Blog

Wednesday, 10 August 2022

8th Pay Commission : ఉద్యోగులకు భారీ షాక్.. 8వ వేతన సంఘంపై కేంద్రం కుండబద్దలు..

 8th Pay Commission : ఉద్యోగులకు భారీ షాక్.. 8వ వేతన సంఘంపై కేంద్రం కుండబద్దలు..

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన వెలువడింది. 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోని స్థితిలో రాబోయే కాలానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయబోవడంలేదని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం నాడు లోక్‌సభకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర వేతన సంఘం సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా? తద్వారా జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా? అంటూ ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎంపీ దీపక్ బాజి, బీహార్ బీజేపీ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోమని ప్రకటించడం ద్వారా రాబోయే కాలానికి కూడా 7వ వేతనం సంఘం సిఫార్సులనే అమలు చేయనున్నట్లు మోదీ సర్కార్ సంకేతాలిచ్చినట్లయింది. అయితే, ప్రస్తుత కాలానికి 7వ పే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి (1947) నుంచి ఇప్పటి వరకు ఏడు పే కమీషన్లు ఏర్పాటయ్యాయి. ఆర్థిక శాఖ పరిధిలో వ్యవహరించే పే కమిషన్లు.. ప్రతి పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ సవరించేందుకు నిర్దేశించారు. చివరిగా 7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలున్నాయి.
కాగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా జీతాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యల గురించి కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందించారు. ఉద్యోగుల జీతాల వాస్తవ విలువలో కోతను భర్తీ చేయడానికి వీలుగా డియర్‌నెస్ అలొవెన్స్ (కరవు భత్యంత) ఇస్తున్నామని మంత్రి మరో ప్రశ్నకు బదులిచ్చారు. భారత వినియోగదారుల ధరల సూచిక కింద అంచనా వేసిన ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్టు తెలిపారు. 8వ వేతన సంఘం ఉండదన్న కేంద్రం ప్రకటనపై ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన వెలువడాల్సి ఉంది.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top