బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు 56 కంపెనీలు స్థాపించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపిన్న సీఈఓగా రికార్డుకెక్కిన ఈ బాలుడు..
మొత్తం 56 కంపెనీలను నడిపిస్తున్నాడు. కట్రా బ్లాకులోని అమ్మ గ్రామానికి చెందిన సూర్యాన్ష్.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. రోజుకు 17-18 గంటలు పనిచేస్తూ..
కొత్తకొత్త కంపెనీలకు జీవం పోస్తున్నాడు. డెలివరీ, మ్యాట్రిమోనీ సేవల నుంచి క్రిప్టోకరెన్సీ వంటి క్లిష్టమైన ఆర్థిక సేవల వరకు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసేందుకు యత్నిస్తున్నాడు.
''సూర్యవంశ్ కాంటాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 56కు పైగా నమోదిత స్టార్టప్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రిజిస్టర్ కావాల్సి ఉంది.
'మంత్రా ఫై' అనేది క్రిప్టో కరెన్సీ కంపెనీ సంస్థ. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
జస్ట్ బిజినెస్ అనేది క్విక్ కామర్స్ సంస్థ. ఓలా తరహాలో జిప్సీ క్యాబ్స్, కులాంతర వివాహాల కోసం షాదీ కరో అనే మ్యాట్రిమోని కంపెనీ స్థాపించా.
ఇన్ని కంపెనీలు స్థాపించడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది'' అని సూర్యాన్స్ పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment