పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డీజిల్, పెట్రోల్ కార్లకు ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక లెక్కల మాస్టర్ వాటికి ప్రత్యామ్నాయంగా ఒక అద్భుతమైన కారును సృష్టించారు. అతను విజయవంతంగా ఒక సోలార్ కారు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇప్పటివరకు అన్ని కాలాలలో నడిచే సోలార్ కారు తయారుచేసిన దాఖలాల్లేవు. పెద్ద కంపెనీలు సైతం వీటిని ఇప్పటివరకు అందుబాటులోకి తేలేకపోయాయి.
కానీ ఈ చిన్న లెక్కల మాస్టారు మాత్రం సంవత్సరం పొడుగూతా నడిచే సోలార్ కార్ తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
కశ్మీర్ లోని శ్రీనగర్‌లోని సనత్ నగర్‌కు చెందిన ఈ మ్యాథ్స్ టీచర్ పేరు బిలాల్ అహ్మద్. లెక్కల మాస్టారు అయినప్పటికీ ఈయన చాలా ఏళ్లుగా ఇన్నోవేటివ్ కార్లను క్రియేట్ చేయడంపై ఒక పెద్ద రీసెర్చ్ చేశారు.
ఆ సమయంలో సౌరశక్తితో నడిచే కారును తయారు చేయాలనుకున్నారు. ఆ ఆలోచనను చేతల్లో చూపించడానికి అతనికి ఏకంగా 11 ఏళ్ల సమయం పట్టింది. అయితే దశాబ్దానికి పైగా చేసిన అతని కృషికి ఇప్పుడు ఫలితం దక్కింది.
ఈ కారు కేవలం సోలార్ పవర్‌తోనే నడుస్తుంది. మోనో క్రిస్టలైన్ సోలార్ ప్యానల్స్‌తో తయారైన ఈ కారు సూర్యరశ్మి తక్కువగా ఉన్నా కరెంటు ఉత్పత్తి చేసి నడవగలదు.
ఈ కారు గురించి తెలుసుకున్న వారంతా కూడా "వావ్, లెక్కల మాస్టారు అద్భుతం సృష్టించారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించగల కారును తయారు చేయడం నిజంగా చాలా గొప్ప" అని వ్యాఖ్యానిస్తున్నారు.
0 Comments:
Post a Comment