Warren Buffett: బిలియనీర్ పెట్టుబడి వ్యాపారి వారెన్ బఫెట్ మరణించినప్పుడు.. అతని 96 బిలియన్ డలర్ల సంపదలో కొంత భాగాన్ని భూమిపై ఉన్న ప్రతి బిడ్డకు పంపిణీ చేయబడుతుందని నివేదికల ప్రకారం తెలుస్తోంది.
2010లో బెర్క్‌షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్ తన సంపదలో 99 శాతం దాతృత్వానికి పంపిణీ చేస్తానని తెలిపారు.
బఫ్ఫెట్ తెలిపిన వివరాల ప్రకారం బెర్క్‌షైర్ 90 బిలియన్ డాలర్ల వాటాలో.. 56 బిలియన్ డాలర్లను కుబేరుడు బిల్ గేట్స్ కు చెందిన.. గేట్స్ ఫౌండేషన్‌కు వెళ్లనుంది.
దీనికి తోడు 17.4 బిలియన్ డాలర్ల సంపద వారెన్ బఫెట్ కుటుంబనాకి చెందిన నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలకు అందజేయబడనుంది.
ఇవి కాకుండా మరో 18.7 బిలియన్ డాలర్ల సంపదను బఫెట్ మరణించడానికి 10 సంవత్సరాల లోపు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు ఫార్చ్యూన్ కథనం ప్రకారం తెలుస్తోంది.
అయితే.. మిగిలిన 18.7 బిలియన్ డాలర్ల డబ్బును పంపిణీ చేయాలనే ఆలోచనల్లో ఒకటి ప్రపంచ పిల్లల పొదుపు బ్యాంకును సృష్టించడంగా ఉంది.
దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పిల్లవాడు వేల డాలర్లు అందుకుంటారు.గేట్స్ ఫౌండేషన్ మాజీ ఉద్యోగి వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. " ఈ ఆప్షన్ పరిగణలో పక్కన పెట్టబడి ఉంది, యుద్ధ ప్రణాళిక లాగా దీనిని అవసరమైనప్పుడు కార్యరూపంలోకి తీసుకురావచ్చు" అని అన్నారు.
అయితే తన మరణం తర్వాత తన మిగిలిన సంపదను ఎలా పంపిణీ చేస్తాడో ఇప్పటికీ వెల్లడించలేదు.
0 Comments:
Post a Comment