రక్త కణాల వృద్ధికి డిఎన్ఏ తయారీకి ఇది సహాయపడుతుంది. గుడ్డు, పొట్టుతీయని ధాన్యం, పెరుగు, పాలు, చేపలు, నెయ్యి, బీట్రూట్, మష్రూమ్స్, ఆల్ఫాల్ఫా అనే ఒకరకమైన గోధుమ జాతికి చెందిన గడ్డి, జున్ను, ఈస్ట్, అరటి, యాపిల్, బెర్రీ జాతి పండ్లను తీసుకోవటం ద్వారా లభిస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిన్.
దీనిలోపం వల్ల రక్తహీనత, మతిమరుపు, నరాల బలహీనత, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి-12 లోపిస్తే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
విటమిన్ బి12 మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారుచేస్తుంది. బి12 లోపిస్తే రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది.
తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ బి 12 తగినంత లేకపోతే ముఖ్యంగా ఎదరయ్యే సమస్య అరికాళ్లు, అరచేతుల తిమ్మిర్లు.
ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ బి12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు. విటమిన్ బి 12 లోపానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.
మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తుంటుంది. జీర్ణాశయంలోని కణాలను ఇలా నాశనం చేయడం వల్ల శరీరం మనం తీసుకునే ఆహారంలోని విటమిన్ బి12 శరీరానికి అందకుండా చేస్తుంది.
ఇలా చాలా తక్కువ మందిలో జరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలోనే సహజంగా విటమిన్ బి12 తక్కువగా ఉండడం. ముఖ్యంగా శాఖాహారుల్లో ఇది కనిపిస్తుంది.
బి12 లోపించినందువల్ల ఏకాగ్రత లేకపోవడం వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వ్యక్తులను గుర్తించడానికి సమయం పట్టడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
శరీరంలో బి 12 మోతాదుల గురించి కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలను పరిశీలించి అందుకు అనుగుణంగా వైద్యులు అందుకు తగిన సప్లిమెంట్లను సూచిస్తారు.
0 Comments:
Post a Comment