ఇంటర్నెట్ డెస్క్: ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలి పిక్కలు పట్టేయడం సాధారణ విషయమే. కానీ, పెద్ద దూరం కాకపోయినా పిక్కల్లో నొప్పిగా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే.
వయసైపోయిందని, మోకాలు నొప్పులున్నాయని వదిలేస్తారు. చాలా తేలికగా తీసుకొని నొప్పి నివారణ మందులను వాడుతుంటారు.
ఈ పిక్కల నొప్పి వెనక ప్రమాదకర పెరఫెరల్ వ్యాస్కూలర్ డీసీజ్ ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి గురించి ఎండో వ్యాస్కూలర్ సర్జన్ మేడా నరేంద్రనాథ్ వివరించారు.
నొప్పి ఎందుకు వస్తుందంటే..!
గుండె నుంచి చేతికి తీసుకొచ్చే రక్త నాళాలుగానీ మెడకు తీసుకెళ్లే రక్తనాళాలు గానీ కాళ్లకు వచ్చే రక్తనాళాలను పెరఫెరల్ వ్యాస్కూలర్ వెజల్స్ అంటారు. వీటికి వచ్చే జబ్బులనే పెరఫెరల్ వ్యాస్కూలర్ డీసీజేస్గా చెబుతారు.
వయసు పెరుగుతున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 60 ఏళ్లకు పైగా ఉన్న వారిలో రక్త నాళాలు గట్టి పడతాయి. పొగ, మద్యం తాగే వారికి కూడా ఇలాంటి సమస్య వస్తుంది. మధుమేహం వారికి కూడా ఈ ఇబ్బందులు తప్పవు.
ఎక్కడైనా రక్తనాళాలు మూసుకొనిపోతే చిన్న సూదులతో సరి చేయడానికి వీలుంది. యాంజియోప్లాస్టీ బెలూన్‌తో స్టంట్ వేస్తే ఎక్కువ కాలం రక్తనాళాలు మూసుకొని పోకుండా ఉంటాయి.
0 Comments:
Post a Comment