Tirumala: టీటీడీ కొత్త ఐడియా.. భక్తుల కోసం వర్చులవ్ క్యూలెన్.. రెండు గంటల్లోనే దర్శనం.. పూర్తి వివరాలివే..!
కోటాను కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy) వెలసిన దివ్య క్షేత్రం తిరుమల.
శ్రీవారి దర్శనార్థం (Tirumala Darshan Tokens) ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమల (Tirumala) కి చేరుకుంటారు భక్తులు. పలు విధాలా టిక్కెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు భక్తులు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేసేందుకు ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిఐపిలు, విఐపిలకు బ్రేక్, ఇతర సేవ టిక్కెట్లను అందిస్తోంది టీటీడీ (TTD). సామాన్య భక్తుల కొరకు శ్రీవారి నిత్య సేవలను లక్కీ డిప్ విధానంలో, ఆర్జిత సేవలను ఫస్ట్ కమ్ ఫస్ట్ టికెట్ విధానాన్ని అమలు చేస్తోంది టీటీడీ. ఇక రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. అంగ ప్రదిక్షణ, వయో వృద్దులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం కొరకు ప్రత్యేక క్యూకాంప్లెక్స్ లను ఏర్పాటు చేసింది.
వర్చువల్ క్యూ అంటే ఏమిటి... వాటివల్ల ప్రయోజనాలు ఏంటి..??
ఫిజికల్ క్యూ విధానంలో ప్రత్యక్షంగా భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గంటల తరబడి క్యూలైన్ లో పిల్లలు., వయో వృద్దులు వేచి ఉంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక క్యూ కాంప్లెక్స్ చేరుకున్న అనంతరం గంటల తరబడి వేచి ఉండాలి. క్యూకాంప్లెక్స్ లలో సైతం టీటీడీ అన్ని సదుపాయాలు చేస్తున్నప్పటికీ వేచి ఉండే సమయాన్ని తగ్గించే పరిస్థితి కనపడటం లేదు. దీని కోసమే టీటీడీ వర్చువల్ క్యూ విధానం ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. భక్తులు ఫిజికల్ క్యూ విధానం నుంచి... వర్చువల్ క్యూ విధానం అమలు చేసే యోచన చేస్తోంది.
నిర్ణిత స్లాట్ టైంలో తిరుమలకు చేరుకోగా... 2గంటల లోపే శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇలా చేయడం ద్వారా స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఫిజికల్ గా క్యూ విధానంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. టైమింగ్ ప్రకారం వచ్చిన భక్తులకు నిర్ణిత సమయంలో దర్శనభాగ్యం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన. ఇప్పటికే వయో వృద్దులు వికలాంగులు దర్శన టోకెన్స్, అంగ ప్రదిక్షణ టోకెన్స్ లోనే విడుదల
ఆన్లైన్ లో టిక్కెట్లు జారీ చేయడం ద్వారా.. భక్తులు టిక్కెట్ల కోసం క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా వెళ్లి స్వామి వారిని రెండు గంటల సమయంలోనే దర్శించుకోవచ్చు.
ప్రస్తుతం ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తూ వచ్చిన అంగప్రదిక్షణ టోకెన్లు గత మూడు నెలలుగా ఆన్లైన్ లో విడుదల చేస్తూ వస్తున్నారు. భక్తులు టిక్కెట్ల కొరకు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా... ఆన్ లైన్ లో టిక్కెట్లను జారీ చేస్తూ వస్తున్నారు. ఇక వయోవృద్దులు, వికలాంగులకు జారీ చేసే ఆఫ్ లైన్ టిక్కెట్లు సైతం ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. కరోనా ముందు వరకు ఈ టిక్కెట్లను ఆఫ్ లైన్ విధానం ద్వారా టిక్కెట్లు ఇచ్చే వారు. అయితే టిక్కెట్ల కోసం క్యూలైన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. వయో వృద్దులు వికలాంగులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తోంది టీటీడీ.
శ్రీవారి దార్శనికి వచ్చే భక్తులకు కరోనా అనంతరం టైం స్లాట్ దర్శనాలు అమలు చేసింది టీటీడీ. అయితే భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం తిరుపతిలోని క్యూ లైన్ లో భారీగా తోపులాట జరగటంతో టైం స్లాట్ దర్శనాలు రద్దు చేసిపాత విధానాన్ని అమలు చేసింది. భక్తులకు ఎలాగైనా దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే విధంగా వర్చువల్ క్యూ విధానం అమలు చేయనుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలను క్షుణంగా అధ్యయనం చేస్తోంది టీటీడీ. అనుకున్న విధంగా అన్ని కలసి వస్తే విఐపి బ్రేక్ దర్శన సమయానికన్నా ముందే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది.
0 Comments:
Post a Comment