✍️టెట్ కేంద్రాల కేటాయింపులో గందరగోళం
♦️ఒక జిల్లాలో ఉదయం.. మరో జిల్లాలో మధ్యాహ్నం పరీక్షలు
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కేంద్రాల కేటాయింపు... అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదయం విశాఖపట్నంలో పరీక్షకు హాజరైన అభ్యర్థి మధ్యాహ్నం శ్రీకాకుళంలో పరీక్ష రాసేలా కేంద్రాలను కేటాయించారు. విజయన గరంలో ఉదయం, శ్రీకాకుళంలో మధ్యాహ్న పరీక్షకు కేంద్రాలను ఇచ్చారు. విశాఖపట్నంలో ఉదయం సెష న్లో పరీక్ష రాసిన అభ్యర్థి 114 కిలోమీటరు దూరం లోని శ్రీకాకుళానికి బస్సులో ప్రయాణించి, మధ్యాహ్న పరీక్షకు ఎలా హాజరు కాగలరు? అనే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. టెట్‌ను ఆన్లై స్క్రీన్ లో నిర్వహిస్తున్నారు. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలు కేటాయిస్తు న్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు శనివారం అవకాశమిచ్చారు. ఆగస్టు 11న ప్రత్యేక ఎడ్యుకేషన్ టెట్ 1బీ, 2బీ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆన్లై న్లో జిల్లాలను జాబితాను ప్రదర్శించారు. పార్వతీ పురం మన్యం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు 1బీకి విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత 2బీకి పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకునేందుకు పరిశీలించగా.. విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాన్ని ఆన్ లైన్ లో చూపించలేదు. కేవలం శ్రీకాకుళమే చూపారు. దాన్నే ఎంచుకోవాల్సి వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన గంగాధరరావు 1బీకి శ్రీకాకుళం ఎంపిక చేసుకోగా.. ఆ తర్వాత ఈ జిల్లా జాబితాలో కనిపించలేదు. దీంతో 208 విజయనగరం ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు 1బీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 2బీ నిర్వహిస్తున్నారు. ఉదయం 12.30 గంటలకు పరీక్ష రాసిన అభ్యర్థి వంద కిలోమీ టర్లు ప్రయాణం చేసి, పరీక్ష ఎలా రాయగలుగుతారో అధికారులకే తెలియాలి. రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేశారు.
0 Comments:
Post a Comment