Search This Blog

Tuesday, 12 July 2022

Teaching Jobs: నవోదయ విద్యాలయాల్లో 1,616 పోస్ట్‌లు.. అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ ఇలా..



ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారికి.. తీపి కబురు. బీఈడీ పూర్తి చేసి..

ప్రభుత్వ ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి చక్కటి అవకాశం. ఆకర్షణీయ వేతనాలతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడేందుకు మార్గం... కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు చెందిన జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి నియామక ప్రకటన!! దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో.. ప్రిన్సిపల్స్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), మ్యూజిక్, ఇతర విభాగాల్లో.. 1,616 పోస్ట్‌ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర సమాచారం...

నవోదయ విద్యాలయ సమితిలో టీచింగ్‌ పోస్ట్‌లు

పలు కేటగిరీల్లో 1,616 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ కొలువులు

జవహర్‌ నవోదయ విద్యాలయాలు.. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నెలకొన్న పాఠశాలలు. వీటిలో ఉద్యోగం లభించిందంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు, కెరీర్‌ ఉన్నతి సొంతమవుతుంది. బీఈడీ ఉత్తీర్ణులు జవహర్‌ నవోదయ పాఠశాలల్లో కొలువుల భర్తీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికే.. రాష్ట్ర స్థాయిలో టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు.. అదే ప్రిపరేషన్‌తో వీటికి పోటీ పడే అవకాశం ఉంది.

టీజీటీ టు ప్రిన్సిపల్‌

ప్రిన్సిపల్‌(గ్రూప్‌-ఎ)-12 పోస్ట్‌లు

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(గ్రూప్‌-బి)-397

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(గ్రూప్‌-బి)-683

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌-థర్డ్‌ లాంగ్వేజ్‌(గ్రూప్‌-బి) - 343

ఇతర టీచింగ్‌ పోస్ట్‌లు (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ- మేల్, పీఈటీ-ఫిమేల్, లైబ్రేరియన్‌)-181పోస్ట్‌లు.

అర్హతలు

ప్రిన్సిపల్‌: కనీసం యాభై శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఈ పోస్ట్‌కు సంబంధించి పని అనుభవాన్ని కూడా అర్హత ప్రమాణంగా పేర్కొన్నారు. వయసు 50ఏళ్ల లోపు ఉండాలి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన నైపుణ్యం, అనుభవం ఉండాలి. వయసు 40ఏళ్ల లోపు ఉండాలి.

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): కనీసం 50శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటె డ్‌ బీఈడీ ఉత్తీర్ణత సాధించాలి.లేదా డిగ్రీతోపాటు బీఈడీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.వయసు 35ఏళ్ల లోపు ఉండాలి.

ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్లొమా(ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్‌ డిగ్రీ(మ్యూజిక్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 35ఏళ్లలోపు ఉండాలి.

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ

నవోదయ విద్యాలయ పోస్టులకు ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలుత కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత నిర్దిష్ట కటాఫ్‌ మార్కులను పేర్కొని.. దానికి అనుగుణంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి పర్సనల్‌ ఇంటరాక్షన్‌ నిర్వహిస్తారు. లైబ్రేరియన్‌ పోస్ట్‌లను మాత్రం కేవలం రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేస్తారు.

వేర్వేరు విభాగాల్లో రాత పరీక్షలు

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, థర్డ్‌ లాంగ్వేజ్‌ టీజీటీ, ఇతర టీచింగ్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్న క్రమంలో.. ఆయా పోస్ట్‌లను అనుసరించి.. రాత పరీక్షను వేర్వేరు విధానాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోస్ట్‌ల వారీగా రాతపరీక్ష తీరుతెన్నుల వివరాలు..

ప్రిన్సిపల్స్‌

విభాగం సబ్జెక్ట్‌ ప్ర. మా.

పార్ట్‌-1 రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 10 10

పార్ట్‌-2 జనరల్‌ అవేర్‌నెస్‌ 20 20

పార్ట్‌-3 లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ హిందీ) 20 20

పార్ట్‌-4 అకడమిక్, రెసిడెన్షియల్‌ అంశాలు 50 50

పార్ట్‌-5 అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్‌ 50 50

మొత్తం 150 150

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు

ఆరు విభాగాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ ప్ర. మా.

పార్ట్‌-1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 10

పార్ట్‌-2 రీజనింగ్‌ ఎబిలిటీ 20 20

పార్ట్‌-3 ఐసీటీ నాలెడ్జ్‌ 10 10

పార్ట్‌-4 టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 10 10

పార్ట్‌-5 సంబంధిత సబ్జెక్ట్‌ 80 80

పార్ట్‌-6 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ హిందీ) 20 20

పార్ట్‌-6లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే మిగతా విభాగాల సమాధానాలను మూల్యాంకన చేస్తారు.

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్, ఇతర టీచింగ్‌ పోస్ట్‌లు

ఈ పోస్ట్‌లకు కూడా ఆరు విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ ప్ర. మా.

పార్ట్‌-1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 10

పార్ట్‌-2 రీజనింగ్‌ ఎబిలిటీ 10 10

పార్ట్‌-3 ఐసీటీ నాలెడ్జ్‌ 10 10

పార్ట్‌-4 టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 10 10

పార్ట్‌-5 సంబంధిత సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ 80 80

పార్ట్‌-6 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ (జనరల్‌ హిందీ, ఇంగ్లిష్, ఎంచుకున్న రీజనల్‌ లాంగ్వేజ్‌) 30 30

పార్ట్‌-6 కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే మిగతా విభాగాల మూల్యాంకన చేస్తారు

అన్ని పేపర్లకు.. కేటాయించిన సమయం మూడు గంటలు.

తుది దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ

అన్ని పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు నిర్దేశిస్తారు. దానికి అనుగుణంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి 1:5 లేదా 1:6 నిష్పత్తిలో చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకున్న సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు టీచింగ్‌ దృక్పథం, బోధన వృత్తిపై ఆసక్తి, అనుభవం వంటి అంశాలను పరిశీలిస్తారు.

ప్రిపరేషన్‌ ఇలా

సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ + సమకాలీనం

ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్షలో విజయానికి సబ్జెక్ట్‌ నాలెడ్జ్, విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్‌-కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

రీజనింగ్‌ ఎబిలిటీ

ఈ విభాగానికి సంబంధించి.. వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. నెంబర్‌ సిరీస్, అనాలజీస్, బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఆడ్‌ మన్‌ ఔట్‌ వంటి అంశాలతోపాటు టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ తదితర అంశాలపై పట్టు సాధించాలి.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగానికి సంబంధించి విద్యా దృక్పథాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెడగాజీ, చైల్డ్‌ సైకాలజీ, కరిక్యులమ్‌ ఆర్గనైజేషన్, లెసన్‌ ప్లాన్, ఇన్‌స్ట్రక్షనల్‌ మెటీరియల్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

లాంగ్వేజ్‌

లాంగ్వేజ్‌ విభాగాలకు సంబంధించి అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ హిందీలకు సంబంధించి.. వ్యాకరణ అంశాలు,బోధనపద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్‌ స్థాయిలో సబ్జెక్ట్‌ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్‌ అండ్‌ ఇన్‌ డెరైక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

ఐసీటీ

ఈ విభాగానికి సంబంధించి బోధన విధానంలో అందుబాటులోకి వస్తున్న ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఆడియో వీడియో లెక్చర్‌ మెటీరియల్స్,వాటి వినియోగం, కంప్యూటర్స్‌ వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

జేఎన్‌వీ.. 2022-23 ముఖ్యాంశాలు

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, థర్డ్‌ లాంగ్వేజ్‌ టీజీటీ, ఇతర విభాగాల్లో 1,616 టీచర్‌ పోస్ట్‌లు.

ఆయా పోస్ట్‌లకు సంబంధించి 150 మార్కులతో రాత పరీక్ష.

రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూ.

ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే పే లెవల్‌-7,8లతో నియామకం ఖరారు.

గరిష్ట వయో పరిమితి విషయంలో రిజర్వ్‌డ్‌ కేటగిరీ వర్గాల వారికి నిబంధనల మేరకు సడలింపు కల్పిస్తారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 22, 2022

ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహణ: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top