డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను అన్నం తినడం మానేసి రొట్టెలు తినమని వైద్యులు చెబుతుంటారు. అన్నం తినడం అనేది షుగర్ పేషంట్స్ కు ఒక శాపం లాంటిది. రోజూ రొట్టెలు తినమంటే ….ఎలా తింటాం అనేది షుగర్ పేషంట్స్ మాట.
టిఫిన్స్ విషయంలో కూడా వీరికి నచ్చింది తినలేని పరిస్థితి. బరువు ఎక్కువగా ఉన్నవారికి షుగర్ ఎక్కువగా వస్తుంది. వీరు బరువును తగ్గించుకుంటూ షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి. మరి ఇలాంటి వారు ఎలాంటి టిఫిన్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతిపరోటా:
ఇందులో ప్రొటీన్, ఫైబర్, కార్బొహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. మధుమేహ రోగులకు చాలా మంది ఆహారం ఇది. దీన్ని తినడం వల్ల మీకు మంచి పోషకాలతో పాటు షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
కొద్దిగా గోధుమ పిండిలో కొంచెం కారం, ధనియాల పొడి, ఉప్పు, వాము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మెంతి ఆకులు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఆ పిండిని అలాగే ఉంచి….కాసేపటి తర్వాత చిన్న చిన్న ఉండలు వేసుకుని చపాతీల తాల్చాలి.
కొద్ది నెయ్యి వేస్తూ పరోటా మాదిరిగా కాల్చుకుని తింటే చాలా టేస్టిగా ఉంటుంది. ఇది ఆరోగ్యంతోపాటు షుగర్ లెవల్స్ ను కూడా అదుపులో ఉంచుతుంది.
బేసిన్ మేతిచిలా..:
శనగపిండికి మెంతిఆకలను కలిపి దోస మాదిరిగా రెడీ చేసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండే అల్పాహారం డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.
శనగపిండిలో మిర్చి, ఉల్లిపాయముక్కలు, కొంచెం కారం, ఉప్పు, వాము, మెంతి ఆకలు వేసుకుని దోస పిండిలా కలుపుకోవాలి. చాలా తొందరగా రెడీ అయ్యే ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ షుగర్ పేషంట్లకు ఎంతో ఆరోగ్యకరమైంది.
ఉడికించిన గుడ్లు:
బరువు తగ్గాలంటే…తప్పనిసరిగా కోడిగుడ్డును అల్పాహారంలో చేర్చుకోవాలి. ఆమ్లేట్, వేపుడుగా కాకుండా…ఉడికించిన కోడిగుడ్లు తింటే గుడ్డులోని ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.
ఒకవేళ ఉడికించిన గుడ్లు తినడం ఇష్టంగా లేకుంటే కొద్దిగా నూనె వేసి అందులో ఉడికించి గుడ్లు వేసి వాటికి ఉప్పు కారం జోడించి తింటే రుచికరంగా ఉంటుంది.
రాగి దోశ:
డయాబెటిస్ పేషెంట్స్ రాగిపిండితో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిరుధాన్యాలు అన్నీ కూడా షుగర్ లెవల్స్ ను అధిక బరువును అదుపులో ఉంచుతాయి.
రాగిపిండది, గోధుమ పిండిని కొద్దిగా తీసుకుని అందులో మజ్జిగ వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ పిండితో దోశలు వేసుకోవాలి. దీన్ని గ్రీన్ చట్నీతో కలుపుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
0 Comments:
Post a Comment