Roasted Black Gram Benefits: నల్ల శనగలు తింటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. Mn
అయితే ఇవ్వి రోడ్ సైడ్స్లోనూ, పార్క్ల్లోను విక్రయిస్తూ ఉంటాయి. ఇందులో మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. కావున రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా బరువును తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియను దృఢంగా చేసి.. శరీరానికి శక్తినిస్తుంది. అయితే ఈ పప్పను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది:
వేయించిన శనగలు తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఇవి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కావున వీటిని క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గిస్తుంది:
బరువు తగ్గడానికి ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిలో చాలా తక్కువ కేలరీలు ఉండడం వల్ల శరీర బరువును నియంత్రిస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనతను నివారిస్తుంది:
వేయించిన శనగలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం లోపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కావున రక్తహీనత సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది:
వేయించిన శనగలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం, ఫోలేట్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యల నుంచి దూరం చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వీటిని తినొచ్చు. ఇందులో ఉండే పోషకాలు అన్ని రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది.
0 Comments:
Post a Comment