Ragi Chembu : మన అందరికీ డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేనిదే ప్రస్తుత కాలంలో మనం ఏదీ చేయలేని పరిస్థితి నెలకొంది. మనం ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కొన్నిసార్లు మన ఇంట్లో డబ్బు నిలవదు.
డబ్బు వృథాగా ఖర్చయిపోవడమే కాకుండా మనం అప్పుల బారిన కూడా పడుతూ ఉంటాం. చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక సమస్యలతో బాధపడడం, ఇంట్లో తరచూ గొడవలు పడడం లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యాలకు గురి కావడం, మానసిక ప్రశాంతతను కోల్పోవడం.. వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు.
Ragi Chembu
మనల్ని లక్ష్మీ దేవి కరుణించకపోవడం వల్ల ఇలా ఆర్థికపరమైన సమస్యలతో బాధపడతామని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో దరిద్ర దేవత ఉండడం వల్లే మనం ఇలా ఆర్థికపరమైన సమస్యలతో బాధపడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
కింద చెప్పిన విధంగా ఒక పరిష్కారాన్ని చేయడం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోవడమే కాకుండా మనం లక్ష్మీ దేవి కరుణాకటాక్షాలను కూడా పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
మన సమస్యలన్నింటినీ దూరం చేసే ఆ పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మన ఇంటి గుమ్మానికి లోపలి వైపు అనగా మన ఇంటి వైపుగా గుమ్మం పక్కన ఉండేలా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా పచ్చ కర్పూరాన్ని, ఐదు రూపాయి బిళ్లలను, ఒక ఎర్ర రంగు పువ్వును అందులో వేయాలి.
వీలైతే అందులో వట్టి వేరు మొక్క వేర్లను కూడా ఆ రాగి చెంబులో ఉంచి గుమ్మానికి లోపలి వైపుగా గుమ్మం పక్కన ఉంచాలి.
ఇలా రోజూ ఆ చెంబులో ఉండే నీటితోపాటు కర్పూరాన్ని, ఎర్ర రంగు పువ్వును, వట్టి వేరు మొక్క వేర్లను మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నుండి దరిద్ర దేవత పోయి లక్ష్మీ దేవత అడుగు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా గుమ్మం లోపలి వైపు రాగి చెంబును, గుమ్మానికి బయట వైపు దీపాలను పెట్టాలి. ప్రతిరోజూ సూర్యాస్తమయం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలను ఎవరైతే ఉంచుతారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదని పండితులు తెలియజేస్తున్నారు.
ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మన ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటకు పోతుంది. దీంతో మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
మనకు ఉండే కష్టాలు, బాధలు, అప్పుల నుండి బయటపడడమే కాకుండా మనం సంపాదించిన ధనం వృథా కాకుండా ఉంటుంది.
మనం ఆర్థిక పురోగతిని కూడా సాధించగలమని, ఇంట్లో కూడా మనఃశాంతి నెలకొంటుందని పండితులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment