Protein Deficiency Symptoms: శరీర దృఢత్వానికి ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్య సమస్యలు తలేత్తకుండా ప్రోటీన్ల ప్రభావవంగా పని చేస్తాయి.
అయితే శరీరంలో వీటి కోరత ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రోటిన్లు సమతుల్యంగా ఉంటేనే కండరాల అభివృద్ధి, చర్మ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున శరీరంలో ప్రోటీన్లు సమత్యుల్యంగా ఉండాలి.
ప్రస్తుతం చాలా మందిలో ఇది లేకపోవడం వల్ల శరీరం భాగాల్లో నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యల బారినపడుతున్నారు. అయితే శరీరంలో ప్రోటిన్లు కోరతగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రోటీన్ లోపం వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధులు ఇవే:
ఎముకలు బలహీనంగా తయారవుతాయి:
చాలా మందిలో బరువు పెరగడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయని అనుకుంటారు. కానీ ఈ కారణం అస్సలు కాదు. శరీరంలో ప్రోటిన్ లోపం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కాలేయ సమస్య:
శరీరంలో తగినంత ప్రోటీన్ పరిమాణం లేకపోతే.. అది కాలేయంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కాలేయ కణాలలో కొవ్వు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఆ తర్వాత కాలేయం దెబ్బతినడం కూడా ప్రారంభం అవుతుంది.
క్వాషియోర్కర్:
శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నవారిలో క్వాసియోర్కర్ వ్యాధి కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ లోపం ఉన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల తీవ్రమైన శరీర వ్యాధులకు దారితీసే అవకాశాలున్నాయి. కావున పిల్లలకు ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం ఇవ్వడం చాలా మేలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటే ఈ లక్షణాలు వస్తాయి:
>>బరువు నష్టం
>>జుట్టు నష్టం సమస్య
>>కండరాల నొప్పి
>>గోర్లు పగుళ్లు
>> రోగనిరోధక శక్తి తగ్గిపోవడం
>>శరీర వాపు
>>శరీర పెరుగుదలపై ప్రభావితం
>>అలసట మరియు చిరాకు
>>చర్మంపై మంట, దద్దుర్లు
0 Comments:
Post a Comment