భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది.
ఐతే రాష్ట్రపతి ప్రస్తుతం ఎంత జీతం వస్తుంది? పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎంత పెన్షన్ వస్తుంది? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
రాష్ట్రపతికి ప్రతి నెల రూ.5లక్షల జీతం వస్తుంది. వసతి, వైద్య సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తుంది. 2017కి ముందు రాష్ట్రపతి జీతం లక్షన్నర మాత్రమే ఉండేది. దానిని 5 లక్షలకు పెంచారు.
అన్ని వసతులతో కూడిన ఇల్లు, రెండు టెలిఫోన్లు, ఒక మొబైల్ ఫోన్ సౌకర్యం ఉంటుంది. ప్రభుత్వమే కారు ఇస్తుంది. దేశంలోని ఏ ప్రాంతానికైనా విమానం, రైలులో, నౌకలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆయనతో పాటు మరొకరికి ఈ సదుపాయం ఉంటుంది.
రాష్ట్రపతి పదవి నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత .. నెలకు రెండున్నర లక్షల పెన్షన్ వస్తుంది. దీనితో పాటు ఆఫీసు ఖర్చులకు మరో లక్ష ఇస్తారు. ఢిల్లీ పోలీసుల భద్రత కల్పిస్తారు. ఇద్దరు కార్యదర్శులు కూడా ఉంటారు.
ఒకవేళ రాష్ట్రపతి లేదా మాజీ రాష్ట్రపతి మరణిస్తే.. వారి భార్యకు 50శాతం పెన్షన్ వస్తుంది. ఆమెకు అన్ని సౌకర్యాలతో కూడి ఇంటితో పాటు ఉచిత వైద్య సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది.
టెలిఫోన్, కారు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఒక ఏడాదికి దేశంలో ఎక్కడికైనా 12 సార్లు ఉచిత ప్రయాణించవచ్చు.
0 Comments:
Post a Comment