Ponnaganti Kura Benefits: ప్రకృతిలో చాలా రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా బాడీకి మంచి శక్తిని అందిస్తాయి.
ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకు కూరలు తింటే శరీరానికి వచ్చే ఫలితాలు అన్నో..ఇన్నో కావు. అయితే అటువంటి కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.
ఇది ఆకు పచ్చ రంగును కలిగి ఉన్న సాధరమైన ఒక ఆకు మాత్రమే.. ఇందులో శరీరాన్ని దృఢ పరిచేందుకు చాలా రకాల పోషకాలు కలిగి ఉంటాయి.
ఈ ఆకు కూర వల్ల శరీరానికి చాలా లాభాలు:
వానా కలంలో లభించే ఆకు కూరల్లో శరీరాన్ని శక్తి వంతం చేసే వాటిలో ఇది ఒకటి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలుంటాయి.
ఇవి బరువును తగ్గించడానికి కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యల నుంచి సంరక్షించి.. దయాన్ని మెరుగుపరుతుంది.
ఇందులో ఉండే పోషక విలువలు.. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా పొన్నగంటి కూర శరీరంలో రక్తాన్ని శుభ్రం చేసి, జీర్ణ శక్తిని పెంచుతుంది.
ఈ కూర తినే క్రమంలో తప్పకుండా ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారమే తీసుకోవాలని పలువురు నిపుణులు తెలుపుతున్నారు. దీనిని అతిగా తినడం వల్ల మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వీటిపై ఇన్స్టట్ ప్రభావం:
పొన్నగంటి కూరను తినడం వల్ల పైత్యం, జ్వరం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మవ్యాధులు నయమవుతాయి. అంతేకాకుండా వీర్య కణాల సమస్యతో బాధపడుతున్న వారికి ఔషధంగా పని చేస్తుంది.
దీని కోసం రోజూ ఒక టీ స్పూన్ ఈ ఆకు రసం తీసుకుని.. వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలు నయమవుతాయి.
అంతేకాకుండా చూపును మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఆకులో ఉండే గుణాలు వైరల్ ఇన్ ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. జీవక్రియలో ఉండే లోపాలను తొలగిస్తుంది.
0 Comments:
Post a Comment