Search This Blog

Wednesday, 20 July 2022

NTPC Recruitment 2022: NTPC Ltd లో ఉద్యోగాలు.. డిగ్రీ, పీజీ అర్హత.. దరఖాస్తు చేసుకోండిలా..

 NTPC Recruitment 2022: NTPC Ltd లో ఉద్యోగాలు.. డిగ్రీ, పీజీ అర్హత.. దరఖాస్తు చేసుకోండిలా..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Ltd) రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
NTPC ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in ద్వారా 29 జూలై 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి జూలై 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ - 15 జూలై 2022
దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ - 29 జూలై 2022
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన 45 పోస్టులు, హెచ్‌ఆర్‌ 01, కాంట్రాక్ట్‌ సర్వీసెస్‌ 04, ఫైనాన్స్‌ 02, అకౌంట్స్‌ 04, పీ అండ్‌ ఎస్‌ 01, క్యూఏ 01, ఐటీ 01, ఐటీ 01 పోస్టులతో పాటు.. మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఎక్జిక్యూటివ్ ఆర్ ఈ సివిల్ పోస్టులు 14, ఎలక్ట్రికల్ పోస్టులు 15 అత్యధికంగా భర్తీ చేయనున్నారు. వీనిలో కూడా రిజర్వేషన్ ప్రకారం పోస్టులను భర్తీ చేయున్నారు. ఒక్క పోస్టు ఖాళీగా ఉన్న కేటగిరీలో అన్ రిజర్వ్ డ్ కింద భర్తీ చేస్తారు.
విద్యా అర్హత
ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి వయస్సు 35 ఏళ్లు మించకూడదు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఇది కాకుండా సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి ..
Step 1: https://careers.ntpc.co.in/openings.php అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Step 2: పునరుత్పాదక శక్తికి సంబంధించిన ప్రకటన సంఖ్య 18/22పై క్లిక్ చేయండి.
Step 3: మీ వివరాలను నమోదు చేసి.. దరఖాస్తు ఫీజును చెల్లించండి.
Step 4: చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 5: ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top