టాటా మోటార్స్ కంపెనీ నెక్సాన్ ఈవీ మ్యాక్స్(Nexon EV MAX) లాంచ్ తర్వాత నెక్సాన్ ఈవీ(Nexon EV) స్టాండర్డ్ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.
ఇప్పుడు దానిని నెక్సాన్ ఈవీ ప్రైమ్(Nexon EV Prime)గా రీబ్యాడ్జ్ చేసింది. ఇది ఇప్పుడు మల్టీ-మోడ్ రీజెనరేషన్, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, ఇండైరక్ట్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(iTPMS), రీజెన్ ఎంగేజ్మెంట్పై ఆటోమేటిక్ బ్రేక్ ల్యాంప్ యాక్టివేషన్, 110 సెకన్ల ఛార్జింగ్ టైమ్ అవుట్ వంటి కొత్త ఫీచర్లను అందిస్తోంది. నెక్సాన్ ఈవీ ప్రైమ్ రూ.14.99 లక్షల ధర (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ విజార్డ్రీని ప్రస్తుత టాటా నెక్సాన్ ఈవీ యజమానులకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అందించేందుకు సిద్ధమైంది. దీంతో కొత్త ఫీచర్లు అన్నింటినీ టాటా నెక్సాన్ ఈవీలు కూడా పొందుతాయి.
ప్రస్తుతం ఉన్న అన్ని టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీలు ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్తో టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఎస్యూవీలుగా మారుతాయి.
టాటా మోటార్స్ భారతదేశంలోని ఏ ఎలక్ట్రికల్ వెహికల్‌కి అయినా ఇదే మొదటి అప్డేట్ అని పేర్కొంది. ఈ అప్డేట్ జులై 25 నుంచి టాటా మోటార్స్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.
టాటా మోటార్స్ కూడా మొదటి సాఫ్ట్వేర్ అప్డేట్ను ఉచితంగా అందిస్తోంది. అయితే దీని తర్వాత వచ్చే అప్డేట్లకు ఛార్జీలు విధిస్తారు. భవిష్యత్తులో కస్టమర్లు ఈ అప్డేట్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే, వారు అందుకు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ..'నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ యావత్ దేశం ఊహలను ఆకర్షించింది. అప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో నిలకడగా ముందు వరుసలో కొనసాగుతోంది.
65 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో ఎలక్ట్రిక్ వెహికల్ ఇండెండర్లకు ఇది డిఫాల్ట్ ఎంపిక. నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైమ్(Nexon EV Prime) మా ఉత్పత్తి ఆఫర్లను ఎప్పటికీ కొత్తగా ఉంచే మా వ్యూహాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం.
ప్రస్తుత ఓనర్లకు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటు టాటా ఈవీ యాజమాన్య అనుభవంలో భాగంగా కస్టమర్లు ఏమి ఆశించవచ్చు అనేదానికి కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.
* టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ వేరియంట్ల ధరలు ఇలా..
టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ XM - రూ.14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ XZ+ - రూ.16.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ XZ+ Lux- రూ.17.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ డార్క్ XZ+ - రూ.16.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ డార్క్ XZ+ Lux - రూ.17.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)
0 Comments:
Post a Comment