New Labour Law: కార్మికులకు వారానికి మూడు రోజులు సెలవు..కానీ ..
New Labour Law: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలు నిన్నటి నుండి అమలులోకి వచ్చాయి. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చట్టాలు జూలై 1 నుండి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనం, పీఎం కంట్రిబ్యూషన్, పని సమయం, వీక్లీ ఆఫ్ లు వంటి వాటిలో పలు మార్పులు ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం నాలుగు రోజులు పని చేయాలి. మూడు రోజులు సెలవు తీసుకోవచ్చు. అయితే రోజు వారి పని సమయం 12 గంటలకు పెరుగనుంది. ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులుగా 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాాల్సి ఉంటుంది. ఒక వేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పని చేయించుకుంటే వారంలో ఒక సెలవు మాత్రమే వస్తుంది. రోజుకు 9 గంటలు పని చేసే వారికి వారానికి రెండు వీక్లీ ఆఫ్ లు లభిస్తాయి. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 26 వారాలు తీసుకోవచ్చు. వీరి అనుమతి లేకుండా కంపెనీ నైట్ షిఫ్ట్ వేయకూడదు.
New Labour Law: చేతికి వచ్చే వేతనం తగ్గుతుంది
కొత్త కార్మిక చట్టం ప్రకారం మొత్తం జీతంలో బేసిక్ పే హాఫ్ ఉండాలి. అంటే అలవెన్స్ లు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక్ పే పెరిగినప్పుడు ఆ మేర పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. దీని వల్ల చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తరువాత వచ్చే మొత్తంతో పాటు గ్రాట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రధానంగా ప్రైవేటు సెక్టార్ లో పని చేసే వారికి జీతంలో ఎక్కువ శాతం అలవెన్స్ లే ఉంటాయి. కొత్త చట్టం వల్ల వారికి చేతికి వచ్చే జీతం తగ్గుతుంది.
కార్మికులకు ఏడాదిలో ఇచ్చే సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే కొత్తగా ఉద్యోగం చేరిన వారు 180 రోజులు దాటిన తర్వాత సెలవులు పొందవచ్చు. ప్రస్తుతం 240 రోజులు దాటిన తరువాత సెలవులు వస్తున్నాయి. అయితే నూతన కార్మిక చట్టాలను కేంద్రం ఆమోదించినప్పటికీ (కేంద్రం, రాష్ట్ర) ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేసి అమలు చేయాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment