Never Drink Water Standing Up : చాలామందికి నిలబడి నీళ్లు తాగేస్తుంటారు. అసలు నీళ్లు ఎలా తాగాలో తెలుసా? సరైన పద్ధతిలో నీళ్లు తాగితేనే ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఏయే భంగిమల్లో నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలో కూడా ఆయుర్వేదంలో స్పష్టం చేశారు. నీళ్లను ఎలా పడితే అలా తాగేయడం ఆర్యోగానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు కూడా.
అందుకే మనకు ప్రాణధారమైన నీటిని సరైన పద్ధతిలోనే తాగాల్సి ఉంటుంది. పూర్వం రోజుల్లో నుంచి పెద్దలు చెబుతున్న మాట కూడా ఇదే…
నిలబడి నీళ్లను తాగొద్దు.. కాసేపు కూర్చొని నీళ్లను తాగండి అని అంటుంటారు. వాళ్ల మాటలను చాలామంది కొట్టిపారేస్తారు. వారంతే చెబుతారే అని పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.
ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ రోజు నుంచే తప్పనిసరిగా అందరూ కూర్చొనే నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.
ఇంతకీ నిలబడి నీళ్లు తాగితే ఏమౌతుంది.. అలాగే కూర్చొని నీళ్లను తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..
నీరు నిత్యావసరం (Water) :
మీ దాహాన్ని తీర్చడానికి నీళ్లకు మించినది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇతర సంబంధిత అనారోగ్యాలు (బరువు సమస్యలు కూడా) వెంటనే తగ్గించుకోవచ్చు.
మీరు రోజూ నీటిని తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం కోసం.. మీరు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీటిని తాగేలా అలవాటు చేసుకోండి
Why You Should Never Drink Water Standing Up, You Must Know These Facts
నిలబడి నీళ్లు తాగకూడదు ( Never Drink) :
సాధారణంగా మనందరికీ ఇంటికి వెళ్లగానే తరచుగా నిలబడి నీరు తాగే అలవాటు ఉంది. అందులో తప్పు ఏముందని అంటారా? ఆరోగ్యం విషయంలో తప్పు చేస్తున్నారనే కదా.. ఎంతసేపు నీళ్లను తాగామా లేదా అనే చూస్తారు. కూర్చోవడానికి బదులుగా నిలబడటం తాగేస్తుంటారు. ఏమౌతుందిలే అని అంటుంటారు. వాస్తవాలు తెలిస్తే..ఇక మీదట అలా చేయరు.
నిలబడి నీళ్లను తాగినప్పుడు మీకు అవసరమైన పోషకాహారం లభించదు. షాక్ అయ్యారా? అవును మీరు విన్నది నిజమే.. నీరు.. సరైన పద్ధతిలో తీసుకోకపోతే.. మీకు అంది మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. ఎక్కడలేని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఆయుర్వేదం (Ayurveda) ఏం చెబుతుందంటే? :
ఆయుర్వేదం ప్రకారం.. మన శరీరాలు ఒక విధమైన నిర్మాణంలో రూపొందాయి. తద్వారా మనం కూర్చుని మన శరీరానికి వ్యాయామం చేసినప్పుడు గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే, మన పెద్దలు ఎప్పటినుంచో కూర్చొని తినమని చెబుతుంటారు.
అలాగే నీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగమని చెబుతుంటారు. దానికి అసలు కారణం ఇదేననే విషయాన్ని మనలో ఎవరూ గ్రహించరు.
సరైన పద్ధతిలో తాగాలి (Right Way) :
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను క్లీన్ చేయాలంటే నీళ్లు తగినంత స్థాయిలో అందాలి. అప్పుడే అన్ని పోషకాలు, ఖనిజాలను పొందేందుకు వీలుంటుంది. మన శరీరంలో 70శాతం నీటితోనే తయారైంది.
ప్రతిరోజూ శరీరం చేసే పనులతో అధిక మొత్తంలో నీటిని కోల్పోతుందని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా గుర్తించుకోవాలి. అందుకే నీటిని శరీరానికి కావాల్సినంత అందించడం ఎంతో ముఖ్యం. అందులోనూ నీటిని సరైన మార్గంలో తీసుకోవడం కూడా ముఖ్యమే.
మీరు నిలబడి తాగినప్పుడు ఆరోగ్యపరంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేగం తగ్గించండి (Slowly Drink) :
చాలామంది నీటిని అతివేగంగా తాగేస్తుంటారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు. నిలబడిన సమయంలో నీటిని ఎత్తి పోసుకుని మరి తాగుతుంటారు. అలా చేయడం వల్ల నీరు నోటిలోనుంచి శరీరంలోకి నేరుగా వెళ్లిపోతుంది. అప్పుడు నీళ్లు అందాల్సిన అవయాలకు చేరదు.
తద్వారా బయటకు వెళ్లాల్సిన మలినాలు, కిడ్నీలు, బ్లాడర్‌లోనే చేరుతాయి. వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ఔత్సాహికురాలు నికితా పర్మార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నిలబడి నీరు తాగడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాలను ఆమె ప్రస్తావించారు.
నరాలను (Nerves) ప్రేరేపించవద్దు :
లేచి నిలబడి నీరు తాగడం వల్ల శరీరం నేచర్ కు తగినట్టుగా ఉండదు. అప్పుడు ఆ ప్రభావం నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ పెరిగి రక్తపోటు వంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాదు.. పోషకాలు వృధా అవుతాయి. మీ శరీరం ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది.
మీ దాహం అసలే తీరదు ( Thirst ) :
నిలబడి నీళ్లను తాగడం ద్వారా పోషకాలు అందకపోగా.. మీ దాహం కూడా తీరదు. ఫలితంగా నీరు నేరుగా వెళుతుంది. అవసరమైన పోషకాలు అందవు. విటమిన్లు, కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు.
ఎందుకంటే మీరు నిలబడి నీరు తాగినప్పుడు అది నాడి వ్యవస్థ ద్వారా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఫలితంగా మీరు మీ ఊపిరితిత్తులు, గుండె పనితీరుకు ముప్పు ఏర్పడుతుంది. ఆక్సిజన్ స్థాయిలు కూడా భారీగా తగ్గిపోతాయి.
నీరు తాగే విధానం.. నిలబడే భంగిమపై ఎఫెక్ట్ (Posture) :
నిలబడి నీళ్లు తాగే సమయంలో చాలామంది ఒక్కో రకమైన భంగిమలో ఉంటారు. అప్పుడు వారు ఏయే భంగిమలో నిలబడతారో అప్పుడు దానిపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆ సమయంలో శరీరంలోకి నీరు వేగంగా ప్రవహించడం వల్ల ఎముకలు, కీళ్లకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది.
కీళ్ల నొప్పులు, ఎముకల క్షీణత, బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే నీటిని మెల్లగా నెమ్మదిగా తాగాలి. మీరు నీళ్లను తాగే విధానంపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
కూర్చున్న చోటే నీళ్లు తాగండి ( Sitting down) :
కూర్చొని ఉన్న చోటే నీటిని తాగాలి. ఇదే సరైన పద్ధతి కూడా. మీరు కూర్చుని మీ భోజనం చేయమని కూడా అందుకే చెబుతుంటారు. మీరు కూర్చుని మీ వీపును నిటారుగా ఉంచినప్పుడు గరిష్ట స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మానవ శరీరాలు కూడా దానికి తగినట్టుగానే రూపొందాయని చెప్పాలి. మీరు కూర్చొని నీటిని తాగినప్పుడు.. పోషకాలు మెదడుకు చేరుతాయి. ఫలితంగా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెరుగైన జీర్ణక్రియకు సాయపడతాయి. నీరు తాగిన తర్వాత మీకు ఉబ్బినట్లు అనిపించకుండా ఉంటుంది.
ఈ విధంగా నీటిని తాగితే.. సాధారణ స్థాయిలో శరీరంలోని అవయవాలలో అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. టాక్సిన్స్ క్లీన్ అయి శరీరంలో పేరుకుపోయిన అన్ని మలినాలను బయటకు పంపేస్తుంది.
అప్పుడు మీరు కోరుకున్న మీ ఆరోగ్యం మీ చెంత ఉన్నట్టే.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే నిలబడి నీళ్లను తాగడం మానుకోండి.. ఎప్పుడూ కూర్చొని నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి..
0 Comments:
Post a Comment