National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా గాంధీకి మరోసారి ఈడీ సమన్లు..
ED Summons Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో జులై 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గత నెలలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారలు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేశారు. అయితే, సోనియా గాంధీ కరోనా బారిన పడటం, అనారోగ్యంతో ఉండటంతో విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరుకాలేనని, మరెప్పుడైనా వస్తానంటూ ఈడీని సోనియా గాంధీ కోరారు. ఆ అభ్యర్థనకు స్పందించిన ఈడీ.. విచారణను వాయిదా వేసింది. ఇప్పటి వరకు రెండుసార్లు విచారణను వాయిదా వేసిన ఈడీ.. ఇప్పుడు మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 21న విచారణకు హాజరు కావాల్సిందిగా సోనియా గాంధీ కోరారు.
0 Comments:
Post a Comment