✍️విద్యాశాఖకు పురపాలక ఉపాధ్యాయుల దస్త్రాలు
*🌻ఈనాడు, అమరావతి:* పురపాలక పాఠశాలల పర్య వేక్షణ, సర్వీసు అంశాలను పాఠశాల విద్యాశాఖకు అప్ప గించినందున ఉపాధ్యాయుల దస్త్రాలను విద్యాశాఖకు పంపించాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్, విదేశాలకు వెళ్లే సెలవులు, ఇతరత్రా అంశాలకు సంబం ధించిన దస్త్రాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేటే కే పంపించాలని సూచించారు. విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకు బోధనేతర సిబ్బందిని కొనసా గించాలని ఆదేశించారు. స్వీపర్లను పాఠశాల విద్యాశాఖ తీసుకుంటుందని వెల్లడించారు. స్థిర, చరాస్తుల నిర్వ హణ పురపాలక సంఘాల ఆధ్వర్యంలోనే ఉంటుంద న్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లను నవీకరించిన తర్వాత విద్యాశాఖకు పంపించాలని సూచించారు.
♦️డిప్యుటేషన్లు రద్దు
పురపాలక కమిషనరేట్ లో రాష్ట్ర అకడమిక్ సమన్వ యకర్తలుగా పనిచేస్తున్న ఎనిమిది మంది ఉపాధ్యా యులు డిప్యుటేషన్లను రద్దు చేశారు. వీరిని ఆయా పుర పాలక కమిషనర్ల వద్ద రిపోర్టు చేయాలని సూచించారు.
0 Comments:
Post a Comment