వర్షాకాలం (Rainy season) ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ తింటూ కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే..
అయితే వర్షా కాలం కేవలం వీటినే కాదు.. ఎన్నో రకాల రోగాలను కూడా తీసుకొస్తుంది. వానాకాలంలో దగ్గు (Cough), వైరల్ ఫీవర్ (Viral Fever), జలుబు (Cold), జ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధులను నుంచి త్వరగా బయటపడాలన్నా.. వీటి బారిన పడకూడదన్నా.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఈ సీజన్ లో ఎన్నో అంటువ్యాధులు, ఇతర జబ్బులు సోకే ప్రమాదం ఉంది.
ఇలాంటి సందర్భంలో మన ఆహారం విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది. ముఖ్యంగా సీజన్ లో దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, జ్వరం వంటి ఎన్నో రోగాలు వస్తాయి.
వీటి బారిన పడకూడదంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. అయితే వర్షాకాలంలో తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది.ముఖ్యంగా ఆకుకూరల (Greens) విషయంలో. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
ఆకుకూరల జోలికి పోకండి:
వర్షాకాలం (monsoon)లో తీసుకునే ఆహారం (food)లో జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో ఆకుకూరల్లో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అందుచేత ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. మొక్కలు, ఆకులపై హానికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా తిష్ఠవేసే సమయం ఇది. అందులోనూ, ఆకుకూరలపై వీటి మనుగడ ఎక్కువకాలం ఉంటుంది. దీంతో.. వీటిని దూరం పెట్టడం మంచిది.
అయినా, ఆకుకూరలను తినాలనుకుంటే కచ్చితంగా 30 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కూర వండుకుని తింటే మంచిది. వీలైనంత వరకు ఆకుకూరలు తీసుకోవడం తగ్గిస్తే బెటర్. కాయకూరల పులుసు సాంబర్ , చట్నీలను తరుచు తీసుకోవాలి. ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లి వేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.
అలాగే పులుపు పదార్థాలు పెరుగు మజ్జిగ లాంటివి పూర్తిగా తగ్గించాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మీ ఇల్లు, పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలి. వంట చేయడానికి, తాగడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. తాజా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మీకు అవసరం ఉన్నంత మాత్రమే వండుకోండి.
ఒకవేళ ఆహారం మిగిలితే రిఫ్రిజిరేటర్లో పెట్టి ఉంచండి. దీని ద్వారా సూక్ష్మ జీవులు పెరగకుండా ఉంటాయి. ఆ తర్వాత వేడి చేసి తీసుకోండి.
పాలు , పెరుగు వంటి పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టడం మంచిది. తాజా పదార్థాలు, కూరగాయలు మాత్రమే ఉపయోగించడం మంచిది.
అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు , మిరియాలు వంటివి ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
0 Comments:
Post a Comment