ప్రధాని మోదీ దేశాల అధినేతలతో సంభాషించడమే కాకుండా వారికి భారతదేశం నుండి ప్రత్యేకమైన హస్త కళ వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు ప్రధాని మోదీ.
జీ-7 దేశాల సదస్సులోనూ ఇదే ఆనవాయితీ కొనసాగించారు. బహుమతుల్లో గులాబీ మీనకారి, నల్ల కుండలు, ఇత్తర్, కాశ్మీరీ కార్పెట్ లాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ బహుమతులు భారతీయ సంస్కృతి, కళలు, హస్తకళలను హైలైట్ చేస్తాయి.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు.. భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా చేతితో అల్లిన కశ్మీరీ పట్టు తివాచీని అందజేశారు. పట్టు తివాచీల మృదుత్వం, నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందం, పరిపూర్ణత, హస్తకళలకు కాశ్మీరీ సిల్క్ కార్పెట్లు ప్రసిద్ధి. కశ్మీరీ సిల్క్ కార్పెట్లు శ్రీనగర్‌లో ఎక్కువగా తయారు చేయబడతాయి. ఇవి పగలు-రాత్రి వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. రెండు కార్పెట్లను చూసినట్టుగా భ్రమను కలిగిస్తాయి.
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు Lacquerware Ram Durbarను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇందులో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, జటాయువు ఉన్నారు. ఈ ఆర్ట్ మూలాలు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందినవి. దేవుళ్లు, మరియు పవిత్ర జంతువుల చెక్క విగ్రహాలు యాత్రికులకు మంచి జ్ఞాపకాలను అందిస్తుంటాయి. వీటిని తయారు చేసే ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది. ఇవి పొరల వారీగా డిస్టెంపర్ లేదా lac-ఆధారిత పెయింట్‌తో కప్పబడి ఉంటాయి. Lacquerware ఐటమ్స్.. ప్రకాశవంతంగా నగల లాగా అనిపిస్తాయి.
మూంజ్ బుట్టలు, కాటన్ డ్యూరీలను సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్కి అందజేశారు మోదీ. సెనెగల్‌లో, చేనేత సంప్రదాయం. వంశపారంపర్యంగా అందిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, సుల్తాన్పూర్, అమేథీ జిల్లాల్లో వీటిని తయారుచేస్తుంటారు. ఇది గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ వనరుగా ఉంది. చేతితో చేసే ఈ బుట్ట వస్తువులు రంగుల్లో జిగేల్మనిపిస్తుంటాయి కూడా.
జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్కి మెటల్ మరోడి మట్కాను బహుమతిగా అందించారు మోదీ. నికెల్ పూతతో, చేతితో చేసిన ఈ ఇత్తడి పాత్ర మొరాదాబాద్ లో మాస్టర్ పీస్ లాంటిది. మొరాదాబాద్ కు పీటల్ నగరి ... "ఇత్తడి నగరం" అనే పేరు కూడా ఉంది. రోజు వాడే వస్తువులనే చమక్కుమనేలా రూపొందించడమే మొరాదాబాద్ హ్యాండ్ క్రాఫ్ట్ స్పెషాలిటీ.
UK PM బోరిస్ జాన్సన్‌కి.. ప్లాటినం పూత ఉన్న చేతితో రంగులద్దిన టీ సెట్ ఇచ్చారు మోదీ. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన టీ సెట్ ఇది. 1200 డిగ్రీల సెల్సియస్ వద్ద కాల్చి దీన్ని తయారుచేస్తారు. అవుట్లైన్లు, మెహందీ కోన్ వర్క్‌తో మాన్యువల్‌గా చేస్తారు. ప్రతి ఆకారాన్ని విడివిడిగా రంగులతో నింపి, గొప్ప నేర్పుతో రూపొందిస్తారు.
అర్జెంటీనా ప్రెసిడెంట్ అల్బెర్టో ఫెర్నాండెజ్‌కి డోక్రా కళతో రూపొందించిన నందిని గిఫ్ట్ గా ఇచ్చారు మోదీ. ఇనుము ఏతర మెటల్స్ ఉపయోగించి చేసే ఆర్ట్ ఇది. ఈ విధమైన మెటల్ కాస్టింగ్ ఇండియాలో 4,000 సంవత్సరాలకు పైగా వాడుకలో ఉంది. ఛత్తీస్‌గఢ్ సహా ఈస్టర్న్ ఇండియాలో ఈ వస్తువులు తయారుచేస్తుంటారు.
గులాబీ మీనాకరి అనే ఆభరణాన్ని US ప్రెసిడెంట్ జో బిడెన్ దంపతులకు అందించారు మోదీ. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఈ కళకు ప్రసిద్ధి. స్వచ్ఛమైన వెండి ముక్కను మౌల్డ్ చేసి, దానికి ఇతర లోహాలు జోడించి రూపొందిస్తారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు రామాయణం థీమ్‌తో డోక్రా ఆర్ట్ నంది లాంటి ఆకృతిని అందించారు ప్రధాని మోదీ. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ ప్రత్యేక కళాఖండం రామాయణ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది. రాముడు, లక్ష్మణుడు, సీతా దేవి, హనుమంతుడితో నుగుపై స్వారీ చేస్తున్న విగ్రహం ఇది.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు జర్దోజీ పెట్టెలో పెట్టిన అత్తర్ సీసాలను గిఫ్ట్ గా ఇచ్చారు మోదీ. ప్రత్యేకమైన అత్తర్ బాటిళ్ల క్యారియర్ బాక్స్‌ను ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రూపొందించారు. జరీ జర్దోజీ పెట్టెపై ఫ్రెంచ్ జాతీయ జెండా.. ఖాదీ సిల్క్ ,శాటిన్పై చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. జాస్మిన్ ఆయిల్, అత్తర్ షమామా, అత్తర్ గులాబ్, ఎక్సోటిక్ మస్క్, లిక్విడ్ గరం మసాలా... పెట్టెలోని ఇతర వస్తువులు.
మార్బుల్ తో కూడిన టేబుల్ టాప్ ను ఇటాలియన్ PM మారియో డ్రాగికి అందించారు మోదీ. పురాతన , మధ్యయుగ రోమన్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పియట్రా డ్యూరా రూపం దీనిపై ఉంది. ఈ మార్బుల్ టేబుల్ టాప్ కళ ఆగ్రాలో ప్రాచుర్యంలో ఉంది. పాలరాయిపైన కళాకారులు విలువైన రంగు రాళ్లను అద్దారు.
గులాబీ మీనకారి నుండి, నల్ల కుండలు, ఇత్తర్, కాశ్మీరీ కార్పెట్ లాంటివెన్నో..! జర్మనీలో జరిగిన G7 సమ్మిట్‌లో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ అందించిన ప్రత్యేకమైన బహుమతుల గురించి తెలుసుకోండి. ఇవి భారతీయ సంస్కృతి, కళ మరియు హస్తకళను హైలైట్ చేస్తాయనడంలో డౌటే లేదు.
0 Comments:
Post a Comment