Ministry of Defense Jobs: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. జీతం రూ.45వేలు..
హెడ్‌క్వార్టర్స్ నార్తర్న్ కమాండ్, డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైర్‌మ్యాన్(Fireman) అండ్ ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ mod.gov.in ని సందర్శించాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ PDF ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఖాళీ వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య- 23
సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్): 5 పోస్టులు
వెహికల్ మెకానిక్: 1 పోస్ట్
క్లీనర్: 1 పోస్ట్
ఫైర్‌మెన్: 14 పోస్టులు
మజ్దూర్: 2 పోస్టులు
అర్హతలు..
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఈ పోస్టులకు సంబంధిత నైపుణ్య పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం.. నెలకు రూ. 18,000ల నుంచి రూ.45700ల వరకు జీతంగా చెల్లిస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్సులను కూడా చెల్లిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్నా దరఖాస్తు పారమ్ డౌన్ లోడ్ చేసుకొని పూర్తి వివరాలను నింపాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ పత్రాలను జతచేసి Commanding Officer 5171 ASC Bn (MT) PIN:905171 C/O 56 APO అడ్రస్ కు పోస్టు చేయాలి. ఈ దరఖాస్తుల పంపించడానికి చివరి తేదీ ఆగస్టు 22, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎంపిక ప్రక్రియ..
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన కొరకు పిలుస్తారు. కనీస ఉత్తీర్ణత మార్కులు 33 శాతం. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు 2 గంటల్లో 150 ప్రశ్నలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రశ్నలు ఇలా.. జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు.
0 Comments:
Post a Comment