✍️విలీనం సమస్యలపై అధికారులు స్పందించాలి: మంత్రి బొత్స:
విద్యార్థులకు మంచి చేయాలనే ఆలో చనతోనే పాఠశాలల విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విలీనంలో ఎక్కడైనా సందేహాలు, సమస్యలు, తలెత్తినా స్థానిక అధికారులు స్పందించాలని సూచించారు. అధికారులు భేషజాలకు పోకుండా వాస్త వాలను తెలుసుకొని సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలని ఆదేశించారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం.
నుంచి 'నాడు-నేడు' పనులపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పది రోజుల్లో 'నాడు-నేడు' రెండో దశ పనులు వందశాతం ప్రారంభించాలి. దీనికి అవసరమయ్యే అనుమతు లను జిల్లా కలెక్టర్లు వెంటనే ఇవ్వాలి. ఇప్పటి వరకు 10,891 పాఠశాలలకు రూ.554 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. పనులకు నిధుల కొరత లేదు' అని వివరించారు.
0 Comments:
Post a Comment