ఈనాడు, హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సరికొత్త రికార్డు సృష్టించింది. స్కార్పియో-ఎన్ వాహనానికి ఒక నిమిషంలోనే 25,000 బుకింగ్లు లభించాయి.
అరగంటకు ఈ సంఖ్య ఒక లక్షకు మించిపోయింది. ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం ఈ బుకింగుల విలువ దాదాపు రూ.18,000 కోట్లు (దాదాపు 2.3 బిలియన్ డాలర్లు).
ఆన్లైన్లో స్కార్పియో-ఎన్ బుకింగ్లను శనివారం ఉదయం 11 గంటలకు మహీంద్రా అండ్ మహీంద్రా చేపట్టింది.
దీనికి వినియోగదార్ల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది.
స్కార్పియో-ఎన్ వాహనాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి డెలివరీలు ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇప్పుడు బుక్ చేసుకున్న వినియోగదార్లందరికీ సంవత్సరాంతానికి డెలివరీలు పూర్తిచేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది
0 Comments:
Post a Comment