Liver : మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలో ఇది చాలా కీలకమైనది. కాలేయం నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. కలుషిత మంచినీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఎ, ఇలు సంక్రమిస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కాలేయ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల కారణంగా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి ముఖ్యంగా తీసుకునే ఆహారమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
కాలేయానికి హాని కలిగించే ఆహారాల విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ముఖ్యంగా మైదా పిండి ఎక్కువగా ప్రాసెస్ చేసినందున, మినరల్స్, ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలు లేని కారణంగా ఇది కాలేయానికి మంచిది కాదు.
పిజ్జా, పాస్తా, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన వాటిని తినకూడదు. రెడ్ మీట్ కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది, జీర్ణం కావడం కష్టం. అధిక ప్రోటీన్ కొవ్వు కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పైన పేర్కొన్న పదార్థాలను దరిచేరనీయకుండా చూసుకోవాలి.
ఎక్కువ చక్కెర కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్యాండీలు, కుకీలు, సోడాల్లో ఉండే ముడి లేదా శుద్ధి చేసిన చక్కెర కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్‌ని ఇష్టపడుతుంటారు చాలామంది. కానీ అవి జీర్ణం చేసుకోవడం కష్టం, ఇవి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీయవచ్చు.
కాలేయ ఆరోగ్యం కోసం ఆకుకూరలు వారానికి 3 రోజులు తినడం వల్ల కాలేయం బలోపేతం అవుతుంది.ఆకుకూరలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది.
కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.
బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి.
రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి.
సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి.కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
0 Comments:
Post a Comment