ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని భావించే భారతీయులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఆఫ్ ఇండియా బెస్ట్ ఆప్షన్లలో ఒకటి. విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు కోసం ఎల్ఐసీ ప్రత్యేకంగా ప్లాన్స్ రూపొందించింది.
ప్రభుత్వం సపోర్ట్‌తో దాదాపు అన్ని వయస్సుల, వర్గాల ప్రజల కోసం ఇన్సూరెన్స్ పథకాలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చింది. రిస్క్ లేని ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే భారతీయులు ఎల్ఐసీ పాలసీలను ఇష్టపడతారు.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌ల తర్వాత ఈ ఎల్ఐసీ పాలసీలు ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. వ్యక్తులకు, కుటుంబానికి తీసుకొనే ఎల్ఐసీ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ ప్లాన్ (LIC Jeevan Mangal Policy) అనేది ఆర్థిక సంక్షోభ సమయాల్లో సహాయపడే అటువంటి పాలసీనే. దీని ఫీచర్లు, ప్రయోజనాలు తెలుసుకుందాం.
* ఇన్‌బిల్ట్ యాక్సిడెంట్ పాలసీ..
ఎల్ఐసీ తీసుకొచ్చిన కొత్త జీవన్ మంగళ్ అనేది మెచ్యూరిటీ తర్వాత ప్రీమియంల రిటర్న్స్ అందిస్తుంది. ఇక్కడ పాలసీ వ్యవధిలో ఒకేసారి లేదా క్రమం తప్పకుండా ప్రీమియంలను చెల్లించవచ్చు.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ ప్లాన్ అతిపెద్ద ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఈ ప్లాన్‌లో ఇన్‌బిల్ట్ యాక్సిడెంట్ బెనిఫిట్ ఉంది. ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు రెట్టింపు రిస్క్ కవర్‌ను అందిస్తుంది.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ పాలసీ అనేది సెక్యూరిటీ బేస్డ్, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, లైఫ్, మైక్రో-ఇన్సూరెన్స్ ప్లాన్.
ఇది మెచ్యూరిటీపై ప్రీమియంల రిటర్న్స్‌తో కూడిన టర్మ్ అస్యూరెన్స్ ప్లాన్. ఇందులో పాలసీ వ్యవధిలో వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ, పక్షం లేదా వారానికోసారి ఏక మొత్తంలో లేదా క్రమం తప్పకుండా ప్రీమియంలను చెల్లించవచ్చు.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ పాలసీ బ్రోచర్ తెలుపుతున్న వివరాల మేరకు.. అన్ని రకాల చెల్లింపుల కోసం రెండు క్యాలెండర్ నెలల గ్రేస్ పీరియడ్ 60 రోజుల కంటే తక్కువ సమయం అనుమతి ఉంటుంది.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ పాలసీ కింద పొందే కనిష్ట ప్రయోజనం రూ.10,000 కాగా, గరిష్టంగా రూ.50,000 అందుతుంది.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ పాలసీని పొందేందుకు, ప్లాన్‌ని కొనుగోలు చేసే తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు (పూర్తి) అయి ఉండాలి. గరిష్టంగా 55 సంవత్సరాలు (సమీప పుట్టినరోజు) ఉండాలి.
మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 65 (సమీప పుట్టినరోజు) అయి ఉండాలి. ఎల్సీ జీవన్ మంగళ్ పాలసీ వ్యవధి సాధారణ ప్రీమియం ప్లాన్‌కు 10 నుంచి 15 సంవత్సరాలు, సింగిల్ ప్రీమియం ప్లాన్లకు ఐదు నుంచి 10 సంవత్సరాలు.
ఎల్ఐసీ జీవన్ మంగళ్ పాలసీ అమలులో ఉండి, మెచ్యూరిటీ తేదీ నాటికి సంబంధిత వ్యక్తి జీవించి ఉంటే.. ప్రీమియంల రూపంలో చెల్లించిన మొత్తం అందుతుంది.
ఇది కాంట్రాక్ట్ వ్యవధిలో (పన్నులు, అదనపు మినహాయించి) చెల్లించిన మొత్తం ప్రీమియంలకు సమానం. ఈ పాలసీ కింద ఎలాంటి రుణ సదుపాయాలు లేవని గమనించాలి. ఎల్ఐసీ జీవన్ మంగళ్ పాలసీకి సంబంధించి డెత్ బెనిఫిట్స్ ఉన్నాయి.
0 Comments:
Post a Comment