ఉపాధ్యాయిని సస్పెన్షన్..
మరో నలుగురికి షోకాజ్ నోటీసులు
నెల్లూరు (విద్య), న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించక పోవడం, పాఠశాలల్లో జరుగుతున్న నాడు- నేడు పనులు ప్రారంభించకపోవడం, తదితర కారణాలతో ఉపాధ్యాయినిని సస్పెండ్ చేస్తూ..
మరో నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను విద్యాశాఖాధికారులు గురువారం జారీ చేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన పాఠశాల విద్యాశాఖ జేడీ మేరిచంద్రిక కల్లూరుపల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, జగనన్న విద్యాకానుక కిట్లు విద్యార్థులకు అందించకపోవడం, తదితర కారణాలతో ఉపాధ్యాయిని ప్రసన్నలక్ష్మిని సస్పెండ్ చేశారు. నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందించారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు
0 Comments:
Post a Comment