Job Alerts: ఉద్యోగ వేటలో ఉన్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్.. ఈ వారం ఉద్యోగాల లిస్ట్ ఇదిగో.. అప్లయ్ చేయండీ..!
ఉద్యోగ (Job) వేటలో ఉన్నవారికి గుడ్ న్యూస్ (Good News). వివిధ ప్రైవేట్- పబ్లిక్ రంగ సంస్థలు ప్రస్తుతం నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. విద్యార్హత, వర్క్ (Work) ఎక్స్పీరియన్స్ బట్టి ఎంపిక ప్రక్రియ ఉండనుంది.
ఈ వారంలో అప్లై (Apply) చేసుకోవాల్సిన జాబ్స్ లిస్ట్ పరిశీలిద్దాం.
* ఐబీపీఎస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ పోస్టుల భర్తీకి ఉమ్మడి రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపడుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చివరి తేదీని జులై 21గా నిర్ణయించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలను చేపట్టనున్నాయి.
* నవోదయ విద్యాలయ సమితి
నవోదయ విద్యాలయ సమితి (NVS) 1616 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రిన్సిపల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)తోపాటు ఆర్ట్, సంగీతం, లైబ్రేరియన్, PET వంటి ఇతర ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు navodaya.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా జులై 22 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిన్సిపల్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.78,800 నుంచి రూ. 2,09,200 మధ్య వేతనం ఉంటుంది. టీజీటీ పోస్టుల వేతన పరిధి రూ.44,900 - రూ.1,42,400 కాగా, పీజీటీ పోస్టులకు రూ.47,600 నుంచి రూ.1,51,100 మధ్య ఉంటుంది. ఇతర ఉపాధ్యాయుల పోస్టుల వేతన పరిధి రూ. 44,900 - 1,42,400 మధ్య ఉండనుంది.
* ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీ అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియ చేపడుతోంది. అగ్నివీర్(SSR), అగ్నివీర్(MR) వంటి రెండు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ నేవీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. కెమిస్ట్, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌తో 12వ తరగతి క్లియర్ చేసిన వారు అగ్నివీర్ SSR పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక10వ తరగతి పాసైన వారు అగ్నివీర్ MR పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా అభ్యర్థుల వయసు 17 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
* తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్
తమిళనాడు యూనిఫాండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TNUSRB) రాష్ట్ర పోలీస్ శాఖలో 3,552 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో గ్రేడ్ II పోలీస్ కానిస్టేబుల్, గ్రేడ్ II జైలు వార్డెన్, ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. అధికారిక వెబ్సైట్ tnusrb.tn.gov.in ద్వారా జూలై 7 నుంచి ఆగస్టు 15 మధ్య ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి లోబడి ఉంటుంది. స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులకు 10 శాతం, మాజీ సైనికులకు 5 శాతం, నిరుపేద వితంతువులకు 3 శాతం ఖాళీలను రిజర్వ్ చేయనున్నారు. అంతేకాకుండా 1 నుండి 10వ తరగతి వరకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఆధారంగా 20 శాతం ఖాళీలు రిజర్వ్ చేయనున్నారు.
0 Comments:
Post a Comment