ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఈ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ITR కింద పన్ను చెల్లింపుదారులు 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 అసెస్మెంట్ సంవత్సరం కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing 2022-23) ఫైల్ చేయవచ్చు.
ఈ ఏడాది ఐటీఆర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం జులై 31ని చివరి తేదీగా నిర్ణయించింది. అయితే చాలా మందిలో సందేహాలు ఉంటాయి. మాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మేము రిటర్న్ ఫైల్ చేస్తే ఏంటి, చేయక పోతే ఏంటి అని నిర్లక్ష్యం వహిస్తుంటారు.
ఐటీ రిటర్న్ అనేది కేవలం ఉద్యోగులు, కోటీశ్వరులు, వ్యాపార వేత్తల వ్యవహారంగా చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతీ పౌరుడు బాధ్యతగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
చాలా వరకూ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థ ఐటీ రిటర్న్ లను లోన్ ఇచ్చేందుకు ప్రామాణికంగా భావిస్తాయి. ITR రసీదును అత్యంత విశ్వసనీయ ఆదాయ రుజువుగా పరిగణిస్తాయి.
మీరు ITR ఫైల్ చేయడం ద్వారా, మీరు భవిష్యత్తులో కారు లోన్ లేదా హోమ్ లోన్ సహా మరే ఇతర రకాలైన లోన్స్ కోసం అప్లై చేసుకున్నట్లయితే మీకు కచ్చితంగా ITR చాలా సహాయం చేస్తుంది. మీరు సులభంగా లోన్ పొందవచ్చు.
ఈ మధ్య కాలంలో చాలా సంస్థలు మీకు చెల్లించే డబ్బులో టీడీఎస్ కట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు, అలాగే ప్రొఫెషనల్స్ కు వారికి చెల్లించే డబ్బులో టీడీఎస్ మినహాయించుకొని చెల్లిస్తున్నారు.
అయితే టీడీఎస్ కింద కట్ అయిన సొమ్మును ఎలా పొందాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అయితే టీడీఎస్ ద్వారా కట్ అయిన సొమ్మును మీరు ఐటీ రిటర్న్ చేసినప్పుడు పొందవచ్చు. సాధారణంగా ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినప్పటికీ, మీ ఆదాయంలో కొంత మొత్తం కచ్చితంగా TDS కింద తీసివేయబడుతుంది.
అలాంటి పరిస్థితిలో, మీరు ITR ఫైల్ చేసినప్పుడు మాత్రమే TDS కింద కట్ అయిన డబ్బును మీరు వాపసు పొంద వచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మాత్రమే ఆదాయపు పన్ను శాఖ మీ టీడీఎస్ ను పోర్టల్ లో మీరు అనుసంధానించిన బ్యాంకులో జమచేస్తుంది.
వీసాలు మంజూరు చేసేటప్పుడు చాలా దేశాలు మీ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్ లను అడుగుతాయి. ITR రసీదులు మీ ఆదాయానికి బలమైన ప్రూఫ్ అని గుర్తుంచుకోండి.
ముఖ్యంగా మీరు అమెరికా లాంటి దేశాలను వెళ్లాలనుకునే వారికి ఆ దేశ అధికారులకు, మీ ఆదాయ రుజువుల కోసం ITR రసీదులను సబ్మిట్ చేయవచ్చు. తద్వారా మీరు మీ ప్రయాణ ఖర్చులను భరించగలరని వారు నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది.
ఆదాయం, చిరునామా రుజువు కోసం ITR ఒక ముఖ్యమైన పత్రం. మీరు ఏ ప్రభుత్వ పని అయినా లేదా ప్రైవేట్ అయినా, మీరు ఆదాయం లేదా చిరునామా రుజువు కోసం ITR కాపీని ఇవ్వవచ్చు. ఇందులో మీ ఆదాయం, నివాసం తదితర పూర్తి వివరాలు ఉంటాయి.
షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా ఐటీఆర్ చేయడం తప్పని సరి అని గుర్తుంచుకోండి.
ఎందుకుంటే మీరు స్టాక్స్, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో బాగా నష్టం జరిగితే, ఆ విషయాన్ని మీరు ఐటీ రిటర్న్ లో తెలపాలి, మీరు పొందిన నష్టాన్ని వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ అయ్యేలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి.
అలా చేయడం ద్వారా మరుసటి సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్స్ లాభంలో ఉన్నట్లయితే, గత సంవత్సరం మీరు పొందిన నష్టాలను ఈ సంవత్సం కాపిటల్ గెయిన్స్ లాభంతో సర్దుబాటు చేయవచ్చు. తద్వారా మీరు కాపిటల్ గెయిన్స్ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కుతుంది.
0 Comments:
Post a Comment