IBPS Clerk Recruitment 2022: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 11 ప్రభుత్వ బ్యాంకుల్లో (బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ స్లిండ్ బ్యాంక్, బ్యాంక్ ఆప్ మహారాష్ట్ర ) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా..
క్లర్క్ పోస్టుల (CRP Clerk XII Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 7,855
పోస్టుల వివరాలు: క్లర్క్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా ఇతర అర్హతలు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ.850
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు: రూ.175
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 1, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 21, 2022.
రాత పరీక్ష (ప్రిలిమ్స్) తేదీ: 2022. ఆగస్టు 28, సెప్టెంబర్ 3, 4 తేదీల్లో
రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు: సెప్టెంబర్ 2022.
మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబర్ 8, 2022.
వివరాణాత్మక నోటిఫికేషన్ ఇదే..
Ibps Notification 2022
0 Comments:
Post a Comment