How to Check FASTag Account Balance: ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ సింపుల్‌గా చెక్ చేయండిలా
ఫాస్ట్‌ట్యాగ్... జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు తప్పనిసరిగా కావాల్సిన ట్యాగ్ ఇది. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లేవాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.
హైవేల మీదుగా వెళ్లే వాహనాలన్నింటికీ దాదాపుగా ఫాస్ట్‌ట్యాగ్ ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల (Toll Plazas) దగ్గరే వీటిని ఇచ్చేస్తున్నారు. టోల్ ప్లాజాల దగ్గర టోల్ ఛార్జీలను (Toll Charges) ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఫాస్ట్‌ట్యాగ్స్ ఉపయోగపడతాయి. అయితే ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయాలంటే అందులో బ్యాలెన్స్ ఉండాలి. ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? (How to Check FASTag Account Balance) అన్న సందేహాలు వాహనదారుల్లో ఉంటాయి. చాలా సింపుల్‌గా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
బ్యాంక్ వెబ్సైట్లో ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా
మీ బ్యాంకు వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ సెక్షన్లోకి వెళ్లాలి. ఆ తర్వాత మీ వివరాలతో లాగిన్ కావాలి. View Balance పైన క్లిక్ చేస్తే మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఫాస్ట్‌ట్యాగ్‌కు రిజిస్టర్ చేసిన తర్వాత టోల్ ప్లాజాల దగ్గర మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిన ప్రతీసారి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్‌లోనే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో తెలుస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రీపెయిడ్ వ్యాలెట్‌కు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే, మీరు ప్రీపెయిడ్ ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ అయితే 08884333331 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో My FASTag యాప్ డౌన్లోడ్ చేసి ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
గతంలో టోల్ ప్లాజాల దగ్గర టోల్ ఛార్జీలు చెల్లించేందుకు వాహనాలు క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఫాస్ట్‌ట్యాగ్ వచ్చిన తర్వాత నిమిషాల్లో కాదు క్షణాల్లో టోల్ ఛార్జీలు చెల్లించి ముందుకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ తగ్గుతోంది.
0 Comments:
Post a Comment