✍️పాఠశాలల విలీనాన్ని అడ్డుకోండి
♦️హైకోర్టులో పిల్.. నేడు విచారణ
🌻ఈనాడు, అమరావతి: జాతీయ విద్యా విధానం పేరుతో రాష్ట్రంలోని పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దీన్ని దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యంపై విచా రణ జరపనుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం, పాఠశాలల విలీనం కోసం జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిష నర్ కోరారు. ఇవి విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృ భాషలో ఉండాలని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోం దని, అంతేకాక ఏపీ హైకోర్టు మాతృభాషలో విద్యా బోధన ఉండాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిం చారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని పాటించడం లేదని, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుణ్ని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
0 Comments:
Post a Comment