Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి.
అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. అవును నిజమే వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే శరీరానికి అందాల్సి పోషకాలు అంది.. గుండె సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. కావున గుండె వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి పచ్చి కూరగాయలను తగినంతగా తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కూరగాయలు తప్పకుండా తినాలి:
బంగాళాదుంప, సోయాబీన్, టొమాటో, ఉల్లిపాయలు, బ్రోకలీ కూరగాయలు గుండెపోటును నివారించడానికి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, అవసరమైన అంశాలు, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన ప్రయోజనాలను అందిస్తాయి.
చేపలు:
చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇవి గుండెను రక్షించడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఆమ్లల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రింస్తుంది.
వెజ్ తినేవారు మష్రూమ్ తినాలి:
మష్రూమ్లో విటమిన్ సి, డి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి.. గుండె జబ్బులను దూరంగా చేస్తుంది. చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కావున వెజ్ మాత్రమే తినే వారు పుట్టగొడుగులను తినాలి. అంతేకాకుండాపచ్చి కూరగాయలు, బొప్పాయి, బచ్చలికూర, క్యాప్సికంలో కూడా విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది.
0 Comments:
Post a Comment