ఇంటర్నెట్ డెస్క్: కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు ఆధునిక వైద్యంలో లేజర్ చికిత్స చేసేవారు. ఇది అద్భుత చికిత్సే కానీ కొన్ని ఇబ్బందులున్నాయి.
వీటన్నింటికీ పరిష్కారంగా ఇపుడు సూపర్ గ్లూ అందుబాటులోకి వచ్చింది. చర్మంపై ఏ మాత్రం కోత లేకుండా సూపర్ గ్లూ చికిత్సతో వెరికోస్ పూర్తిగా మాయం అవుతోందని వైద్యులు చెబుతున్నారు.
ఈ చికిత్స ఎవరికి అనుకూలమో, ఎవరికి ప్రతికూలమో ఎండో వ్యాస్క్యులర్ సర్జన్ నరేంద్రనాథ్ మేడా వివరించారు.
నరాలు ఉబ్బి.,ఇబ్బంది పెట్టి
కండరాల లోపల గోడల కింద నరాలుంటాయి. అవి కాళ్లు, చేతుల గుండా గుండెకు రక్తం తీసుకెళ్తుంది. గోడలు బలహీన పడినపుడు నరాల్లోని రక్తం గుండెకు వెళ్లకుండా మళ్లీ కాళ్లు, చేతుల్లోకి వచ్చినపుడు నరాలు ఉబ్బిపోతాయి. పిక్కలు ఉబ్బిపోతాయి. పాదాలు బండరాయిలా మారుతాయి. మడమ చుట్టూ నలుపు వచ్చి గాయాలవుతాయి.
చికిత్సలో ఎన్నో మార్పులు
నరాలు ఉబ్బినపుడు చేసే చికిత్సల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కన్వెన్షల్ సర్జరీలో కాలు తొడ, మడమ, పాదాల వద్దో కోసి రక్తం తీసేసేవారు.
సన్న ఇంజిక్షన్ ద్వారా స్థానికంగా మత్తు మందు ఇచ్చి లేజర్‌తో మంట పెట్టి మూస్తారు. కొత్తగా గ్లూ థెరపీ అందుబాటులోకి వచ్చింది.
నొప్పి లేకుండా చికిత్స చేసే వీలుంది. ఉబ్బిన రక్తనాళం నుంచి రక్తం కారకుండా ఈ గ్లూ నిలిపివేస్తుంది. చికిత్స తర్వాత వెంటనే వెళ్లిపోయి పనులు చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment