Search This Blog

Saturday, 23 July 2022

GPF - ఉద్యోగుల సొమ్ము ఎప్పుడిస్తారు? జీపీఎఫ్‌ డబ్బులు తిరిగి వారి ఖాతాలకు చేర్చాల్సిందే వేరే అవసరాలకు ఉపసంహరించినట్లుగా ఉంది ధిక్కరణను తప్పించుకోడానికి సాంకేతిక కారణాలా? స్వతంత్ర ఆడిట్‌కు ఆదేశించే పరిస్థితి తెచ్చుకోవద్దు.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

 ఉద్యోగుల సొమ్ము ఎప్పుడిస్తారు?

జీపీఎఫ్‌ డబ్బులు తిరిగి వారి ఖాతాలకు చేర్చాల్సిందే

వేరే అవసరాలకు ఉపసంహరించినట్లుగా ఉంది

ధిక్కరణను తప్పించుకోడానికి సాంకేతిక కారణాలా?

స్వతంత్ర ఆడిట్‌కు ఆదేశించే పరిస్థితి తెచ్చుకోవద్దు


ఉపసంహరణకు అక్కర్లేని అనుమతులు.. జమకు అవసరమా?

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

మీరిచ్చిన వివరాలు కాగ్‌కూ అర్థంకావని వ్యాఖ్య

బడ్జెట్‌ మంజూరు కాగానే జమ చేస్తాం: ఏజీ
''రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల కోసం నిధులను (ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి) ఉపసంహరించినట్లు కనబడుతోంది. అవసరం తీరాక ఇప్పుడు వాటిని జమ చేస్తామని చెబుతోంది. కోర్టు ధిక్కరణను తప్పించుకొనేందుకు సాంకేతిక కారణాలను తెరమీదకు తీసుకొచ్చారు. నిధుల ఉపసంహరణ వ్యవహారాన్ని స్వతంత్ర చార్టెడ్‌ అకౌంటెంట్‌తో ఆడిట్‌ చేయించే పరిస్థితి తీసుకురావద్దు. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌కు భిన్నంగా వ్యవహరిస్తే సీఎస్‌ తదనుగుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' - హైకోర్టు వ్యాఖ్యలు
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి ఉపసంహరించిన సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారో నిర్దిష్ట సమయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. నిధుల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిన వివరాలు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కూడా అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించింది. నిధుల ఉపసంహరణ వ్యవహారాన్ని స్వతంత్ర చార్టెడ్‌ అకౌంటెంట్‌తో ఆడిట్‌ చేయించే పరిస్థితి తీసుకురావద్దని, కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌కు భిన్నంగా వ్యవహరిస్తే సీఎస్‌ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు మూడో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. పీఆర్సీ విషయంలో ఈ ఏడాది జనవరి 17న ప్రభుత్వం జారీచేసిన జీవో1ని సవాల్‌ చేస్తూ ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం వేతన సవరణ ఉత్తర్వుల ఆధారంగా ఏ ఉద్యోగి జీతంలోనూ రికవరీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీ రవితేజ వాదనలు వినిపించారు. ''సొమ్ము ఉపసంహరణ విషయంలో పిటిషనర్‌కు ముందుగా ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. జీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి సొమ్మును లూట్‌ చేశారని పిటిషనర్‌ మొదట ఆందోళన చెందారు. ప్రభుత్వమే సొమ్మును ఉపసంహరించినట్లు తరువాత తెలుసుకున్నారు. పిటిషనర్‌ ఖాతా నుంచి రూ.91,226 మొత్తాన్ని ఉపసంహరించారు. అందుకు సంబంధించి జీపీఎఫ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచాం. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి జీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి సొమ్మును ఉపసంహరించారు' అని వివరించారు. అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ....సాంకేతిక కారణాలవల్లే ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము ఉపసంహరణ జరిగిందన్నారు. పీఆర్సీ వ్యవహారానికి, సొమ్ము ఉపసంహరణకు సంబంధం లేదని తెలిపారు. బడ్జెట్‌ మంజూరు అయిన వెంటనే సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలు వివరించేందుకు ఏజీ ప్రయత్నించగా.. పిటిషనర్‌ తరఫున న్యాయవాది స్పందించారు. ఇలాంటి తీవ్రమైన కేసులో అడిషనల్‌ సెక్రటరీతో అఫిడవిట్‌ వేయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు . దీనికి ఏజీ బదులిస్తూ...ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అందుబాటులో లేకపోవడంవల్లే అడిషనల్‌ సెక్రటరీతో అఫిడవిట్‌ వేయించాల్సి వచ్చిందన్నారు. ఇక పై ముఖ్యకార్యదర్శి అఫిడవిట్‌ వేస్తారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ప్రభుత్వం చెప్పే వివరాలు కాగ్‌కి కూడా అర్థం కావని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణకు ఎలాంటి అనుమతి అవసరం లేదుగానీ, తిరిగి వాటిని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బడ్జెట్‌ మంజూరు కావాలా అని ప్రశ్నించింది. ఉద్యోగుల ఖాతాల నుంచి దాదాపు రూ.2,200 కోట్ల వరకు ఉపసంహరించారని గుర్తు చేసింది. వేరే అవసరాల కోసం వాటిని వినియోగించి, అవసరం తీరాక ప్రస్తుతం తిరిగి వాటిని జమచేస్తామని చెబుతున్నారని వ్యాఖ్యానించింది.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top