సాంకేతిక లోపం వల్లే..‘జీపీఎఫ్ నగదు’ ఉపసంహరణ
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు.. ప్రభుత్వం అఫిడవిట్*
*🌻అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి)*: సాకేతికలోపం కారణంగానే ప్రభు త్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉపసంహరించిన నగదును ఇతర అవసరాలకు మళ్లించలేదని పేర్కొంది. ట్రె జెరీ నిబంధనల మేరకు మార్చి 31నాటికి పెండింగ్ బిల్లులన్నీ రద్దవుతాయని, ఆ తరువాత వాటిని డీడీవోలు తిరిగి సమర్పిస్తారని తెలిపింది. ఆ బిల్లులను ట్రెజరీ శాఖ క్లియర్ చేసిన వెంటనే ఖాతాల నుంచి ఉపసంహరణకు గురైన మొత్తం తిరి గి ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొంది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించలేదని తెలిపింది. పీఆర్సీ విషయంలో ఈ ఏడా ది జనవరి 17న ప్రభుత్వం జారీ చేసిన జీవో1ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కె.వి.కృష్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తన ఖాతా నుంచి ఉపసంహరించిన మొత్తం వివరాలను పిటిషనర్ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపించారు. ‘కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి పిటిషనర్ జీపీఎఫ్ అకౌంట్ నుంచి సొమ్మును ఉపసంహరించారు. భవిష్యత్తులో రెండోసారి పిటిషనర్‌కు సొమ్ము క్రెడిట్ అవుతుందనే అనుమానంతో డబ్బులు ఉపసంహరించినట్లు కౌంటర్లో పేర్కొనడం వింతగా ఉంది. అడిషనల్ సెక్రెటరీ పేరుతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడమంటే కోర్టు ప్రతిష్ఠకు భం గం కలిగించడమే’ అని వివరించారు. అడ్వకేట్ జనరల్(ఏజీ)ఎ్‌స.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో, కోర్టు నిర్దేశించిన గడువు ముంచుకొస్తుండడంతో అనివార్య పరిస్థితుల్లో అడిషనల్ సెక్రెటరీ పేరుతో కౌంటర్ వేయాల్సి వచ్చిందన్నారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏజీ దాఖలు చేసిన అదనపు కౌంటర్ అఫిడవిట్ కోర్టు రికార్డుల్లో లేకపోవడంతో విచారణను జూలై 22కి వాయిదా వేసింది.
0 Comments:
Post a Comment