Search This Blog

Thursday, 21 July 2022

Freedom - స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ హద్దులు మీరుతోందా ?

 స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ హద్దులు మీరుతోందా ?

ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించడం. మనకు నచ్చిన బట్టలు వేసుకుంటాం, మనకు నచ్చిన ఫుడ్ తింటాం, మనకు నచ్చిన సినిమా చూస్తాం. స్వేచ్ఛగా జీవించడం మన హక్కు. ఇతరులు మనల్ని శాసించడం నేరమా, పాపమా అనే విషయాల్ని పక్కన బెడితే... అది మనం సహించలేం. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు భరిస్తామేమో గానీ, అదే పనిగా నియంతృత్వంతో మన హక్కుల్ని కాలరాచి తమ అభిప్రాయాలనూ, తమ అభిరుచులనూ మనమీద రుద్దాలని ప్రయత్నిస్తే ఎదురు తిరుగుతాం. 

అయితే, స్వేచ్చకు హద్దులున్నాయా? అంటే వున్నాయనే చెప్పాలి. మన అభిప్రాయాలను నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పే హక్కు మనకెంత వుందో ఎదుటివారి మనోభావాలు దెబ్బ తినకండా చూడాల్సిన బాధ్యత కూడా మనమీద వుంటుంది.
పనిగట్టుకుని ఇతరుల మనసుల్ని నొప్పించే వ్యాఖ్యానాలు ఎప్పుడూ స్వేచ్ఛ అనిపించుకోవు. అయితే, ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? అంటే, కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అన్నట్టుగా ఒకరు పనిగట్టుకుని ఇతరుల మనోభావాల్ని అదే పనిగా దెబ్బ తీస్తున్నారంటే అది వారి లక్షణమైనా అయి వుండాలి. లేదా ఎదుటివారి పట్ల వారి మనసులో తీరని కోపమైనా వుండి వుండాలి. ఏదేమైనా అలా ప్రవర్తించడం సరైనది కాదనే చెప్పాలి. 

ఇకపోతే, స్వేచ్ఛలో ఎన్నో అంశాలున్నాయి. వాటిలో ఒకటి వాక్ స్వాతంత్య్రం. మన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించడానికి ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి ఎన్నో వ్యక్తిగత వేదికలు అంటే పర్సనల్ ప్లాట్ ఫామ్స్ వున్నాయి. యూ ట్యూబ్ లో సైతం ఇదివరకు సెలెబ్రిటీలు మాత్రమే వీడియోలు పెట్టేవారు. కానీ, ఇప్పుడట్టా కాదు. ఎవరైనా తమకు తోచిన, తమకు నచ్చిన వీడియోలను చేసి అప్ లోడ్ చేయవచ్చు. దీంట్లో లాభ నష్టాలకన్నా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికే అనేక మంది అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 

యూ ట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకోవాలనుకునే వారు కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. విడిపోవాలనే ఆలోచన లేని సెలెబ్రిటీ జంట విడిపోతోందనీ, సినిమా గురించి పబ్లిక్ ఒకలా చెప్తే 'ఇదేం సినిమారా బాబూ...' అని వారన్నట్టుగా థంబ్ నెయిల్స్ పెట్టి అప్ లోడ్ చేసేస్తూంటారు. ఇక ఆల్రెడీ విడిపోయిన జంటలు ఒకరి గురించి ఒకరు ఏదో అన్నారనీ, అనుకోకండా ఎక్కడో ఎదురు పడ్డారని ఏవేవో వీడియోలు పెట్టేస్తూంటారు. 

దురదృష్టమేంటంటే, వార్తల్ని వక్రీకరించే వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూంటాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛ హద్దులు మీరడమే... కాకపొతే, ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక అంశం వుంది. వీడియోలు వైరల్ అవడంతోనే అయిపోదు. చట్టపరమైన శిక్షల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు 'ఎందుకీ పని చేశాంరా బాబూ...' అని బాధపడక తప్పదు.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top