ఆదాయ పన్ను విషయంలో ఛారిటబుల్ సర్వీస్‌లకు సపోర్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సంస్థలు ట్యాక్స్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద, అర్హత కలిగిన ఛారిటబుల్ ఆర్గనైజేషన్స్‌కు చేసిన డొనేషన్లపై ట్యాక్స్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.
విరాళాలు అందించిన వ్యక్తులు క్లెయిమ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్న కారణంగా.. అన్ని ప్రభుత్వేతర సంస్థలు(NGO) లేదా ఛారిటబుల్ ఆర్గనైజేషన్స్‌కు సెక్షన్ 80G కింద డిడక్షన్ పొందే అర్హత ఉండదని తెలిపింది.
విరాళాల రసీదులు, 80G సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఆదాయపన్ను(డిడక్షన్లు) కమిషనర్ ఆమోదించిన సంస్థలకు మాత్రమే అర్హత ఉంటుందని RSM ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా చెప్పారు.
* సెక్షన్ 80G అంటే ఏంటి?
సెక్షన్ 80G కింద, పన్ను చెల్లింపుదారు.. అంటే వ్యక్తి, కంపెనీలు లేదా సంస్థలు - కొన్ని రిలీఫ్ ఫండ్లు, ఛారిరటబుల్ ఆర్గనైజేషన్స్‌కు చేసిన విరాళాల కోసం ఆదాయపన్ను డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు.
కొత్త పన్ను విధానాన్ని సెలక్ట్ చేసుకున్న వారు ఈ డిడక్షన్‌ను పొందలేరు. చెక్కు, డ్రాఫ్ట్ లేదా నగదు ద్వారా చేసిన విరాళాలు ఈ డిడక్షన్‌కు అర్హులు. ఆహారం, మెటీరియల్, బట్టలు లేదా ఔషధాల రూపంలో ఇతర విరాళాలు సెక్షన్ 80G కింద ట్యాక్స్ డిడక్షన్‌కు అర్హత పొందవు.
* సెక్షన్ 80GGA అంటే ఏంటి?
సెక్షన్ 80GGA అనేది సెక్షన్ 80G కింద సబ్ సెక్షన్. ఇది శాస్త్రీయ పరిశోధన లేదా గ్రామీణాభివృద్ధికి విరాళంగా ఇచ్చే డబ్బును ట్యాక్స్ నుంచి మినహాయిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పట్టణ పేదరిక నిర్మూలన నిధికి పన్ను చెల్లింపుదారులు చేసే ఏదైనా కాంట్రిబ్యూషన్ కూడా పన్నుల నుంచి డిడక్షన్ పొందుతుంది.
వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయాన్ని (లేదా నష్టాన్ని) చవిచూసిన వారికి మినహా అన్ని మదింపుదారులకు సెక్షన్ 80G కింద డిడక్షన్ పొందే అవకాశం ఉంటుంది.
* సెక్షన్ 80Gకి సవరణ
ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80Gకి సవరణను ప్రవేశపెట్టింది, దీని కింద రూ.2,000 కంటే ఎక్కువ నగదు రూపంలో చేసిన విరాళాలు ఇకపై డిడక్షన్ పొందలేవు. రూ.2,000 కంటే ఎక్కువ విరాళాలు అందజేసే వారు, సెక్షన్ 80G కింద ట్యాక్స్ డిడక్షన్‌కు అర్హత సాధించడానికి నగదు రూపంలో కాకుండా మరో రూపంలో సహకారం అందజేయాల్సి ఉంటుంది. ఈ సవరణ తీసుకురాక ముందు డబ్బు రూపంలో అందజేసే విరాళం లిమిట్ రూ.10,000గా ఉంది.
* అర్హత ఉండే విరాళం మొత్తం
సెక్షన్ 80G ప్రకారం, రెస్ట్రిక్షన్స్ ఉన్నా లేకున్నా విరాళాలు 100 శాతం లేదా 50 శాతం ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.
* డిడక్షన్‌కు అర్హత పొందే విరాళాలు
జాతీయ రక్షణ నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, మత సామరస్య జాతీయ ఫౌండేషన్, ఆమోదం పొందిన విశ్వవిద్యాలయాలు లేదా ప్రముఖ జాతీయ విద్యా సంస్థలు, జిల్లా సాక్షర సమితి, పేదలకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య సహాయం, జాతీయ అనారోగ్య సహాయ నిధి వంటి సంస్థలకు చేసిన విరాళాలు , నేషనల్ స్పోర్ట్స్ ఫండ్, నేషనల్ కల్చరల్ ఫండ్, నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్‌కు అందజేసిన విరాళాలు 100 శాతం డిడక్షన్ పొందుతాయి. జవహర్లాల్ నెహ్రూ స్మారక నిధికి, ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లేదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చేసిన విరాళాలు క్వాలిఫైయింగ్ లిమిట్ లేకుండా 50 శాతం డిడక్షన్‌ను పొందుతాయి.
* సెక్షన్ 80GGA కింద అనుమతించే విరాళాలు
సెక్షన్ 35(1)(ii) ప్రకారం నిర్దేశిత అధికారం ద్వారా ఆమోదించిన శాస్త్రీయ పరిశోధన సంఘం లేదా కళాశాల, విశ్వవిద్యాలయం లేదా ఏదైనా ఇతర సంస్థకు చేసిన విరాళం డిడక్షన్నకు అర్హత పొందుతుంది.
ఈ సెక్షన్ కింద అనుమతించిన ఇతర డిడక్షన్లలో సంఘాలు లేదా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే సంస్థలకు చెల్లించే మొత్తాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కోసం శిక్షణ పొందిన వ్యక్తులకు సంబంధించిన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థ, స్థానిక అధికారం లేదా ఆమోదం పొందిన సంఘం లేదా సంస్థకు చెల్లించిన మొత్తం ఉన్నాయి.
0 Comments:
Post a Comment