డ్రైవింగ్ (Driving)లో సరైన శిక్షణ లేకపోవడమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం . దేశంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నా..
రవాణా రంగంలో నిపుణులైన డ్రైవర్ ల కొరత అధికంగా ఉంది. ప్రధానంగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్ లలో సరైన తర్ఫీదు పొందిన వారు చాలా తక్కువ ఉన్నారు.
మన తెలంగాణ లో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రహదారి ప్రమాదాల నివారణ, వాహన చోదకులకు మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణలో నే మొట్టమొదటి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్, రీసర్చ్ సెంటర్ (Institute of Driving Training, Research Centre) ను స్థానిక శాసన సభ్యులు, మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవ తో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా మండేపల్లి వద్ద ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ సెంటర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR), మంత్రి శ్రీ కే తారక రామారావు (KTR) తో కలిసి గత సంవత్సరం జూలై 4 న ప్రారంభించారు.
దక్షిణాదిన అతి పెద్ద కేంద్రం మండేపల్లి ఐటీడీఆర్..
అశోక్ లేలాండ్ సంస్థ నిర్వహించే ఈ కేంద్రానికి కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. దేశవ్యాప్తంగా పది డ్రైవింగ్ శిక్షణ (Driving Training) కేంద్రాలుండగా.. దక్షిణ భారత దేశంలో తమిళనాడు, కర్ణాటకతో కలిపి తెలంగాణలో మూడోది.
దక్షిణ భారత దేశంలో ఉన్న కేంద్రాలలో ఇదే అతి పెద్దది. శిక్షణలో చేరే అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పిస్తూ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలంటే సగటున పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చవుతుంది.
గ్రామీణ అభ్యర్థులకు లైట్ మోటర్ వెహికల్ శిక్షణ కు అయ్యే మొత్తం ను ప్రభుత్వమే భరిస్తుంది.హెవీ మోటార్స్ వెహికల్ శిక్షణ కు స్పాన్సర్ లు అందించే ఆర్థిక సహాయం తో అభ్యర్థులకు శిక్షణ అందజేస్తుంది. దీనికోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రత్యేకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
అధునాతన శిక్షణ..
ఐడీటీఆర్ (IDTR)లో శిక్షణ ఇచ్చేందుకు డిజిటల్ తరగతి గదులు, ఐదు రకాల వాహనాలు అందుబాటులో ఉంచారు. 3.25 కిలోమీటర్ల పరిధిలో నాలుగు, ఆరు వరుసల రహదారులను నిర్మించారు. ట్రాఫిక్ నిబంధనలు వివరించేలా ఏర్పాట్లు చేశారు.
తరగతులతో పాటు డిజిటల్ త్రీడీ డైవింగ్ శిక్షణకు ప్రత్యేక గది ఉంది. చోదకులు వాహనాలు నడుపుతూ మధ్యలో ఇబ్బందులు తలెత్తినపుడు అత్యవసర మరమ్మతులపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచి శిక్షణ అందిస్తున్నారు.
భారీ, తేలికపాటి వాహనాల శిక్షణను 3 నెలల కాలపరిమితితో అందిస్తున్నారు. శిక్షణ తరగతులకు ఒక్కో బ్యాచ్‌కు 30 మందికి అవకాశం ఇస్తున్నారు. ఏటా సగటున నాలుగు వేల మంది శిక్షణ పొందే వీలుంది.
పాఠ్యాంశాలు.. వాహనాలపై శిక్షణ ఇచ్చేందుకు ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా అశోక్ లేలాండ్ సంస్థ శిక్షణ ఇస్తుంది. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి అందించే ధ్రువీకరణ పత్రంతో రాష్ట్రంలో ఏ రవాణాశాఖ కార్యాలయం నుంచైనా లైసెన్సు (License) పొందే వీలుంది.
122 మందికి ఉద్యోగ అవకాశాలు..
4 జూలై 2021న ప్రారంభించినప్పటి నుంచి ఒక సంవత్సరం కార్యకలాపాలను పూర్తి చేశారు. 90 రోజుల డ్రైవర్ శిక్షణా కార్యక్రమంలో మొత్తం 317 మంది విద్యార్థులు చేరారు.
ఇందులో 240 మంది విద్యార్థులు విజయవంతంగా కోర్సును పూర్తి చేశారు . వారిలో 112 మంది ఇప్పటివరకు ఉపాధి పొందారు. వారు కూడా పెద్ద పెద్ద కంపెనీ లో భారీ జీతాలు తీసుకుంటున్నారు.
ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..
DDU - GKY EGMM సపోర్ట్ ద్వారా నడుస్తున్న ప్రోగ్రామ్ కు సంబంధించి ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అభ్యర్థులు వయస్సు 20 నుండి 28 సం.లు ఉండాలి . అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయి ఉండాలి .
చదువు 10 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ . ఎత్తు 160 సెం.మీ ల పైన ఉండాలి . భారతదేశం లో ఎక్కడైనా డ్రైవర్ ఉద్యోగం చేయుటకు సిద్ధంగా ఉండాలి . శిక్షణ కాలం 90 రోజులలో 60 రోజులు సిరిసిల్ల ఇన్స్టిట్యూట్ నందు 30 రోజులు అప్రెంటిషిప్ , లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ 1 సం . పూర్తి అయి ఉన్న వారికి హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ ఇవ్వబడును , ఏ విధమైన లైసెన్స్ లేని వారికి లైట్ మోటార్ వెహికిల్ శిక్షణ ఇవ్వబడును . మీకు ఏ విధమైన సందేహాలు ఉంటే ఈ మొబైల్ నెంబర్ కు 8985431720 సంప్రదించగలరు . Email Id : tides.sircilla@gmail.com Website : www.tidessircilla.com ను సంప్రదించాలి.
శిక్షణ పొందిన డ్రైవర్ లకు మంచి వేతనాలు..
ఇక్కడ (Driving School) శిక్షణ తీసుకున్న నైపుణ్యం కలిగిన డ్రైవర్ లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని రవాణా శాఖ అధికారి కొండల్ రావు తెలిపారు. ఐడీటీఆర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో చోదక శిక్షణ అందిస్తున్నారు. రవాణా రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం..అలాగే వారికి విదేశాలలో లక్షలో జీతం రహదారి ప్రమాదాల నివారణ.. వాహనాలకు ఉపయోగించే ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం వంటివి ఈ శిక్షణా కేంద్రం ముఖ్య ఉద్దేశం అని అధికారి కొండల్ రావు తెలిపారు.
రాష్ట్ర మంత్రి కే తారక రామారావు (KTR) ప్రత్యేక చొరవ తో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్ ( ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ తెలంగాణ కే మణిహారం.రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణం. .సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు శిక్షణ పొందడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. హెవి వెహికల్స్ డ్రైవర్స్ కు డ్రైవింగ్ పద్దతులను అందించడం ద్వారా తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల అవసరాలను తీర్చుతుంది. సమగ్ర వివరాల కోసం యువత సెంటర్ వెబ్సైట్ www.tidessircilla.com ను సంప్రదించాలని కోరారు. జిల్లా నిరుద్యోగ యువతకు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
0 Comments:
Post a Comment