Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర రోడ్డ రవాణా, రహదారుల శాఖ కొత్త నియమాలు జారీ చేసింది.
డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలు మీ కోసం.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం చూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇక నుంచి లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగే పనిలేదు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ జారీ చేసిన కొత్త నియమాలు అమల్లోకి వచ్చేశాయి.
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా..ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే మీరు లైసెన్స్ తీసుకోవచ్చు. కొత్త నియమాల ప్రకారం గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించే టెస్ట్ ఉత్తీర్ణులైతే చాలు. టెస్ట్‌లో క్వాలిఫై అయినవారికి డ్రైవింగ్ లైసెన్స్ లభ్యమౌతుంది.
ఇప్పటి వరకూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగడం, క్యూల్లో పడిగాపులు కాయడం జరిగేది. ఇప్పుడా అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్లు ప్రారంభిస్తున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సంస్థ నిర్వహించే పరీక్ష పాసవాల్సి ఉంటుంది. పరీక్ష పాసైన తరువాత..డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ జారీ అవుతుంది.
ఆ తరువాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇక ఆ తరువాత ఆర్టీవో నుంచి ఏ విధమైన టెస్టింగ్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.
డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ సిమ్యులేటర్, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌కు సంబంధించిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరైతే టెస్ట్ క్వాలిఫై అవుతారో..వారికి లైసెన్స్ జారీ అవుతుంది. లైట్ మోటార్ వెహికల్ కోసం 29 గంటల సమయముంటుంది.
0 Comments:
Post a Comment