Mistakes Made While Checking Blood Sugar: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద వ్యాధిగా రూపాంతరం చెందబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే మధుమేహం కారణంగా శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం మార్పులు చెందుతుంది. కొంతమందిలో ఈ చక్కెర పరిమాణం తగ్గితే.. మరికొందరిలో ఈ చక్కెర పరిమాణం పెరుగుతుంది. ఇలా మార్పులు చందనం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ మార్పులను కనుగొనేందుకు వైద్యులు గ్లూకోజ్ పరీక్షలు చేస్తారు. రక్తంలో చక్కెర పరిమాణం మార్పులు చెందినప్పుడు వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
గ్లూకోజ్ పరీక్ష చేసే ముందు చాలామంది వ్యాధిగ్రస్తులు అనేక పొరపాట్లు చేస్తున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ పరీక్షలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం..
షుగర్ పరీక్షించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి:
వాతావరణంలో తేమ:
వాతావరణంలో వేడిగా లేదా చల్లగా ఉంటే.. గ్లూకోమీటర్ రీడింగ్ తప్పుగా ఇస్తుంది. కావున వాతావరణం లో మార్పు లేని సందర్భంలో మీరు ఈ పరీక్షను నిర్వహించుకుంటే.. ఖచ్చితమైన ఫలితాన్ని పొందగలుగుతారు.
అంతేకాకుండా సాధారణ ఉష్ణోగ్రత వద్ద రక్తంలో చక్కెర పరిమాణాన్ని పరీక్షించుకోవడం చాలా మేలు. లేదంటే వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే నిజమైన ఫలితాన్ని పొందుతారు.
తిన్న వెంటనే రక్తంలో చక్కెర పరిమాణాన్ని పరీక్షించకండి :
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తిన్న వెంటనే రక్తంలో చక్కెరను పరిశీలిస్తే పరిమాణం శాతం అధికంగా చూపిస్తుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత షుగర్ పరీక్షను అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం అధికంగా చూపిస్తుంది.
0 Comments:
Post a Comment